జడ్చర్ల టౌన్, ఫిబ్రవరి 21 : ఫుడ్‌పాయిజన్‌తో విద్యార్థులు అస్వస్థతకు గురైన యూనివర్సిటీపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. శుక్రవారం జడ్చర్ల సమీపంలోని పోలేపల్లి సెజ్‌లో ఉన్న ఎన్ఎంఐఎంఎస్యూ ఎదుట ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ నాయకులు ధర్నా చేపట్టారు. యూనివర్సిటీలో గురువా రం విద్యార్థులు అస్వస్థతకు గురవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విద్యార్థుల వద్ద రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేసి నాసిరకం భో జనం అందిస్తున్న యూనివర్సిటీ యాజమాన్యంపై చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ గు ర్తింపు రద్దు చేయాలని కోరారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆం దోళనలు చేస్తామని హెచ్చరించారు. ధర్నా విషయం తెలుసుకున్న జడ్చర్ల ఎస్సై జయప్రసాద్తోపాటు యూనివర్సిటీ యాజమాన్యం అక్కడికి చేరుకొని వారితో మాట్లాడి ఆం దోళన విరమింపజేశారు. ఇదిలా ఉండగా యూనివర్సిటీ లో శుక్రవారం ఉదయం అస్వస్థతకు గురైన మరో 10 మంది విద్యార్థులను చికిత్స నిమిత్తం ప్రైవేట్ దవాఖానకు తరలించినట్లు సమాచారం.
పోలేపల్లి సెజ్‌లోని ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీ లో చదువుతున్న విద్యార్థులు అస్వస్థతకు గురై జిల్లా కేం ద్రంలోని ఎస్వీఎస్ దవాఖానలో చికిత్స పొందుతున్న వి షయం తెలుసుకొని బీఆర్ఎస్ నేతలు యాదయ్య, సుదర్శన్‌గౌడ్, ఇంతియాజ్, నాగిరెడ్డి, కరాటే శ్రీను వెళ్లి పరామర్శించారు. అస్వస్థతకు గల కారణాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత దవాఖాన యాజమా ని రాంరెడ్డితో మాట్లాడి మెరుగైన వైద్యచికిత్సలు అందించాలని సూచించారు. యాజమాన్యంతో మాట్లాడి ఇలాం టి ఘటనలు పునావృతం కాకూడదన్నారు.