వనపర్తి, జనవరి 7 (నమస్తే తెలంగాణ) : ప్రతి వ్యవసాయ సీజన్లో కేసీఆర్ ప్రభుత్వంలో ఆరేండ్లపాటు ఠం చన్గా రైతుబంధు సాయం అందించింది. సీజన్‌కు ముందుగా ఏటా వానకాలం, యాసంగిలో రైతుల బ్యాంకు ఖాతాల్లో ఎకరాకు రూ.5 వేల చొప్పున ప డుతూ వచ్చాయి. కరోనావంటి ఉపద్రవాలొచ్చినా.. రై తుబంధు పథకం ఏనాడూ ఆగలేదు సరికదా.. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుబంధు పథకం అటకెక్కింది. కేసీఆర్ ప్రభుత్వంలో కంటే మరింత అధికంగా పెట్టుబ డి సాయం ఇస్తామని ప్రకటించినప్పటికీ.. దానిని అమ లు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ యాసంగి సీజన్ దాటిపోతున్నా మీనమేషాలు లెక్కిస్తున్నది. ఇప్పుడు.. అ ప్పుడు అంటూ వాయిదాలు వేస్తుండడంతో అన్నదాత లు అయోమయానికి గురవుతున్నారు. ప్రస్తుత యాసం గి సీజన్లో జిల్లాలోని 1,83,882 మంది అన్నదాతల కు రైతుబంధు సాయం అందించేందుకు జిల్లా వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇందుకుగానూ ఈ సీజన్లో వీరికి దాదాపు రూ.184,88, 57,833 మేర సాయం అందించాల్సి ఉన్నది. అయితే, ఇప్పటివరకు జిల్లాలో కేవలం 66,185 మంది రైతులకు రూ.18,05,46,137 మాత్రమే ఖాతాల్లో జమయ్యాయి.
ఈ సాయం కేవలం ఎకరాలోపు ఉన్న రైతులకు కూడా పూర్తిగా అందలేదు. అయితే ఈ పెట్టుబడి సాయాన్ని గత అసెంబ్లీ ఎన్నికల ముందే అందించే ప్ర యత్నం చేసిన క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సం ఘానికి ఫిర్యాదు చేయడంతో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో రైతుబంధు సాయం ఇప్పటి వరకు అతీగతి లేకుండా పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గా లు చేపట్టిన తర్వాత రైతుబంధు పథకం వాయిదాలు ప డుతుంది. ఎలాంటి స్పష్టత లేకుండా ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యేల వరకు దాటవేసే ధోరణితో కాలయాపన చేస్తున్నారన్న విమర్శలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే యాసంగి సాగుబడుల సమయం ముందుకు వెళుతున్నప్పటికీ పెట్టుబడి సాయం మాత్రం అందనంత దూరం లో ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన రో జు నుంచి అన్నదాతలు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం చెప్పిన వాయిదాలు గడిచిపోతున్నాయి. గతంలో సీజన్‌కు ముందే డబ్బులు అం దుకున్న రైతులు ప్రస్తుత యాసంగి సీజన్లో కుదేలవుతున్నారు. మళ్లీ ప్రైవేటుగా అప్పులతో యాసంగి సాగు చేపడుతున్నారు.
రైతుబంధు సాయం జిల్లాలో ఇంకా రూ.162 కోట్ల వరకు రైతుల ఖాతాల్లో జమ కావాల్సి ఉన్నది. రైతులకు అందాల్సిన పెట్టుబడిలో కనీసం 10 శాతం కూడా దా టకపోవడంతో రైతులు గందరగోళంలో పడ్డారు. ఇంకా 1,17,697 మంది రైతులు కంట్లో ఒత్తులు వేసుకొని పె ట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వ్యవసా య కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తమ రైతుబంధు సాయం ఏమైందంటూ ఆరా తీస్తున్నారు. అధికారులు సైతం రైతులకు సమాధానాలు చెప్పలేక ముఖం చాటేస్తున్నారు. గతంలో కంటే అధికంగా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఎందుకు చేస్తుందో రైతులకు అర్థం కావడం లేదు. ఇటు అధికారులు.. అటు ప్రభు త్వం స్పష్టతనివ్వకపోవడంతో రైతులు అయోమయాని కి గురవుతున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తేనే డబ్బులు వస్తాయని కార్యాలయాలకు వచ్చిన రైతులకు అధికారులు చెబుతున్నారు. అంతకు మించి ఎలాంటి సమాచారాన్ని ఇవ్వడం లేదు.
గతేడాదితో పోల్చితే ప్రస్తుత యాసంగి సాగు జిల్లాలో సగానికి మించి తగ్గిపోయింది. ఇందుకు రైతుబంధు సాయం సకాలంలో అందకపోవడంతో పాటు ప్రభుత్వం నీటిని నిలిపివేయడం.. వర్షాల ప్రభావం కూ డా ఓ కారణంగా చెబుతున్నారు. పోయిన యాసంగిలో 2,14,207 ఎకరాల్లో సాగుబడులు జరిగాయి. ప్రస్తుత యాసంగి సీజన్ వారీగా చూస్తే.. ఇప్పటివరకు 34,081 ఎకరాల్లో సాగు జరిగినట్లు వ్యవసాయశాఖ లెక్కలు చెబుతున్నాయి. ఇంతలా ఒకేసారి రైతన్నలు సేద్యానికి దూరం కావడం పలు అనుమానాలకు దారితీస్తుంది. ఆర్థిక పరిస్థితుల నుంచి రైతన్నలు గట్టెక్కాలంటే ప్రభు త్వ ప్రోత్సాహం తప్పనిసరి అందాలి. ఈక్రమంలో రైతుబంధు సాయం వెనక్కి.. ముందుకు అవుతుండడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. ఎన్నికలకు ముందే అందుతుందనుకున్న యాసంగి పెట్టుబడి వా యిదాలు పడుతూ మరింత దూరంగా వెళుతున్నట్లు కనిపిస్తుంది. రైతన్నల ఎదురు చూపులు ఎండమావులు కా కుండా ఉండాలంటే.. కాంగ్రెస్ సర్కారు వెంటనే రై తుబంధు పెట్టుబడులను అన్నదాతల ఖాతాల్లో జమ చే యడం ద్వారానే ఉపశమనం పొందే అవకాశం ఉన్నది.
అన్నదాతలకు అండగా నిలవాలని కేసీఆర్ సర్కా రు 2018లో రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చింది. సా గుబడుల్లో పెట్టుబడులకు ఎకరాకు రూ.4 వేల చొప్పు న పథకం ప్రారంభంలో అందించింది. క్రమంగా ఈ పథకాన్ని ఎకరాకు రూ.5 వేలకు పెంచి నిరాటంకంగా గత వానకాలం వరకు అమలు పరిచింది. సమయానికి రైతుల చేతుల్లో డబ్బులు ఉండకపోవడం.. ప్రైవేటుగా అధిక వడ్డీలకు డబ్బులు తీసుకొని రైతులు ఆగమవుతున్నారని భావించి రైతుబంధు పథకాన్ని అమ లు చేశారు. ఈ పథకం కోట్లాది మంది రైతన్నల కు టుంబాల్లో వెలుగులు నింపిందని చెప్పాలి. తెలంగాణ లో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని రైతులు డిమాండ్ చేసే పరిస్థితి ఏర్పడింది.