నారాయణపేటరూరల్, ఆగస్టు 22 : నారాయణపేట మండలం పేరపళ్ల గ్రామంలో పేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో జాయమ్మ చెరువులో భుములు కోల్పోతున్న రైతుల భూములకు సంబంధించి శనివారం రీసర్వే కొనసాగింది. ఒక్కో బృందంలో ఒక సర్వేయర్తోపాటు ఇద్దరు జీపీవోలు, ఒక గిర్దావర్ ఉన్నారు.
సర్వేయర్ ధనవంతి బృందం 80, 81, 82, 83 సర్వే నెంబర్లను సర్వే చేశారు. సర్వేయర్ జయశంకర్ బృందం సర్వే నెంబర్ 60 నుంచి 63 వరకు సర్వేను చేయగా సర్వేయర్ రాజయ్య బృందం 96 సర్వే నెంబర్ నుంచి 101వరకు సర్వే నిర్వహించారు. పేట తాసీల్దార్ అమరేందర్ కృష్ణ పర్యవేక్షణలో ఈ సర్వే కార్యక్రమం కొనసాగింది. సర్వేలో ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.
పేరపళ్ల గ్రామ శివారులోని తమ పొలాలు పేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో ముంపునకు గురవుతున్నాయి. అయితే మా భూముల సర్వే నెంబర్లు 80,81లో బాయికాని పెద్ద కిష్టప్ప, హన్మంతు, నర్సప్ప, చిన్న కిష్టప్ప, మల్లప్ప పేర్లపై మొత్తం 16 ఎకరాల 16 గుంటల సాగు భూమి 50 ఏండ్లుగా మేమే ఖాస్తులో ఉన్నాం.
అయితే గతంలో సర్వే చేసినప్పుడు మా భూమి సాగు చేసే చోట కాకుండా గుట్ట ప్రాంతంలో ఉందని చూయిస్తున్నదని అధికారులు తెలిపారు. అయితే ఇప్పుడైన మా భూముల సర్వేను పారదర్శంగా చేపట్టి మాకు తగిన న్యాయం చేయ్యాలని కోరారు. అదేవిధంగా శరణమ్మ 82/ఆ సర్వే నెంబర్లో 4 ఎకరాలు, జనార్దన్ 3.32 ఎకరాలు భూమి కూడా గతంలో సర్వే చేసిన సమయంలో గుట్టకు ఉందని చెప్పారు. ఇప్పుడైనా సర్వేను పారదర్శకంగా చేపట్టి మాకు న్యాయం చేయాలని అధికారులను కోరారు.