అచ్చంపేట రూరల్, జూన్ 24 : సర్కారు బడిలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు.. మెరుగైన విద్య.. నాణ్యమైన మధ్యాహ్న భో జనం.. అన్ని సౌకర్యాలతో పాఠశాలలు ని ర్వహిస్తున్నామని ఇటీవలే బడిబాట కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు గొప్పలు చెప్పారు. ఆచరణలో మాత్రం అందుకు వి రుద్ధంగా నిర్వహణ కొనసాగుతున్నది. మంగళవారం ‘నమస్తే తెలంగాణ’ అచ్చంపేట మండలంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గల పాఠశాలలను విజిట్ చేయగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
మండలానికి దాదాపు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏజెన్సీ గ్రామాల్లో సర్కారు బడుల్లో వి ద్య పేద విద్యర్థులకు అందని ద్రాక్షగానే మిగిలిందని చెప్పవచ్చు. ఆర్టీసీ బస్సు అచ్చంపేట, దేవరకొండ డిపోల నుంచి వస్తేనే బడి గంట మోగుతుంది. లేదంటే అప్రకటిత హాలిడే ఇక్కడ అమలవుతున్నది. మండలంలోని ఏజెన్సీ గ్రామాల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఆర్టీసీ బస్సును నమ్ముకొనే కొలువులు చేస్తున్నారు. ఉదయం ఆర్టీసీ బస్సుకు పోవడం, మళ్లీ తిరుగు ప్రయాణంలో బడికి తాళం వేసి ఆ యాకు తాళం అందించి అందిన వాహనం లో ఇంటికి చేరుకోవడం ఇదే తంతు నడుస్తున్నది.
సింగిల్ టీచర్ ఉన్న పాఠశాలలో అ త్యవసరంగా సెలవు పెట్టుకుంటే ఆ రోజు బ డి బంద్, విద్యార్థులకు సెలవు. ఒకవేళ టీ చర్ బడికి రావాలంటే ఆర్టీసీ బస్సు రావాలి. బస్సు ఎప్పుడు వస్తే అప్పుడే బడి తలుపులు తెరుచుకుంటాయి. సమయ పాలన లేదు, ప్రార్థన అంతకంటే ఉండదు. ఇంత జరుగుతున్నా పట్టించుకోకపోవడం విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లోపమే కారణంగా తల్లిదండ్రులు అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కూలినాలి చే సైనా, ఫీజులు ఎక్కువైనా సమయం సరిపోకపోయినా తమ పిల్లలను నల్గొండ జిల్లా చందంపేట మండలంలోని ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తున్నామని చెబుతున్నారు.
ఉద యం 6గంటలకు ప్రైవేట్ బస్సు పిల్లలను ఎక్కించుకొని మళ్లీ సాయంత్రం 6గంటలకు ఇంటి వద్ద దింపుతున్నారని ఆవేదన చెందుతున్నారు. బక్కలింగయ్యపల్లిలో పనిచేసే టీచర్ పాఠశాలకు సెలవు పెట్టడంతో విద్యార్థులు తాళం వేసిన బడి ఎదుట బ్యాగులతో కూర్చున్నారు. అలాగే ఘణపూర్లో టీచర్ అరగంట బస్సుకు ఆల స్యం రావడంతో ఇద్దరు పిల్లలు పాఠశాల ఆవరణంలో ఉన్నారు. ఇక్కడి విద్యార్థులకు గుడ్డి గుర్తు ఏంటంటే.. ఆర్టీసీ బస్సు లు వస్తేనే బడి లేదంటే సెలవని అర్థం. బస్సును చూసి అప్పుడు ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు చెప్పి బ్యాగును బడికి తీసుకొస్తారు. స మయ పాలన ఉపాధ్యాయులకు సం బంధం లేదు.
వేస వి సెలవులు ము గిసి 12రోజులైనా ఇంకా పూర్తి స్థా యిలో విద్యార్థులు పాఠశాలకు రా వడం లేదు. టీచర్లు మాత్రం తప్ప దు అన్నట్లు ఆర్టీసీ బ స్సుకు పాఠశాలకు వచ్చి మళ్లీ సా యంత్రం అదే బస్సుకు వెళ్లిపో యి తమ విధులను పూర్తి చేస్తున్నారు. ఇప్పటికైనా విద్యాధికారులు దృష్టిసారించి సర్కారు బ డుల్లో పనిచేసే టీచర్లు సమయ పా లన పాటించేలా చూడాలని వి ద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.