నారాయణపేట టౌన్, ఆగస్టు 18: పేద, బడుగు బలహీన వర్గాల సమానత్వం, ఐక్యత కోసం పోరాడిన గొప్ప వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని కలెక్టర్ సిక్తాపట్నాయక్ అన్నారు. ఆదివారం సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్లో పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. మాట్లాడుతూ బడుగులను ఐక్యం చేసి ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని గోల్కొండ కోటను జయించిన సర్వాయి పాపన్న నేటితరానికి ఆదర్శప్రాయుడన్నారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అబ్దుల్ ఖలీల్, డీపీఆర్వో రషీద్, రఘురామయ్యగౌడ్, శ్యాంసుందర్ గౌడ్, వెంకటేశ్‌గౌడ్, బాలరాజుగౌడ్ పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ కలెక్టరేట్, ఆగస్టు 18: మొగలులు, గోల్కొండ నవాబులను ఎదురించి తెలంగాణ కీర్తి పతాకాన్ని ఎగరవేసిన సాహసవీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పాపన్న జయంతిని జిల్లాకేంద్రంలోని పద్మావతికాలనీ వద్ద ఏర్పాటు చేసిన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాపన్నగౌడ్ పేదలకు చేసిన సేవలను కొనియాడారు. కలెక్టర్ విజయేందిరబోయి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్‌గౌడ్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిణి ఇందిర, చంద్రకుమార్‌గౌడ్, సిరాజ్‌ఖాద్రీ పాపన్న విగ్రహానికి నివాళులర్పించారు.
మక్తల్ ఆగస్టు 18 : గౌడ జనహకుల పోరాట సమితి ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి ఉత్సవాలను ఆదివారం మక్తల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండయ్య పాల్గొన్నారు.
ఊట్కూర్, ఆగస్టు 18 : ఉద్యమస్ఫూర్తితో గౌడ కులస్థులు ముందుకు సాగాలని గీతాసెల్ నాయకులు శంకర్‌గౌడ్, కృష్ణయ్యగౌడ్, జగదీష్‌గౌడ్ అన్నారు. పాపన్నగౌడ్ జయంతిని స్థానిక మెయిన్‌బజార్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నర్సింహరాజ్గౌడ్, నవీన్‌గౌడ్, నర్సింహాగౌడ్ పాల్గొన్నారు.
జడ్చర్ల, ఆగస్టు 18: పాపన్నగౌడ్ జయంతిని ఆదివారం జడ్చర్లలో నిర్వహించారు. ఈ సందర్భంగా సిగ్నల్‌గడ్డ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీసీసేన రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య, బీజేపీ జిల్లాఅధికార ప్రతినిధి బాలవర్ధన్‌గౌడ్, సీపీఎం నాయకులు గోపాల్, కురుమూర్తి, సత్యయ్య, కౌన్సిలర్లు ఉన్నారు.
నవాబ్‌పేట, ఆగస్టు 18: మండల కేంద్రంతోపాటు కొల్లూరు, కాకర్లపహాడ్‌లో ఆదివారం పాపన్న జయంతిని ఆయా గ్రామాల్లో గౌడసంఘం, నాయకులు పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ నర్సింహులు, మండలాధ్యక్షుడు గోపాల్‌గౌడ్, కృష్ణ, దశరథం, గోపాల్ పాల్గొన్నారు.
హన్వాడ, ఆగస్టు 18: పాపన్నగౌడ్ జయంతిని హన్వాడ, పెద్దదర్పల్లిలో ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన విగ్రహానికిపూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్, సింగిల్ విండో వైస్ చైర్మన్ కృష్ణయ్యగౌడ్, మాజీ వైస్ ఎంపీపీ లక్ష్మయ్య, మాధవులుగౌడ్ పాల్గొన్నారు.
మహ్మదాబాద్, ఆగస్టు 18: మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో పాపన్నగౌడ్ జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రాజశేఖర్‌గౌడ్ పాల్గొన్నారు.
మండలంలోని వెన్నాచేడ్‌లో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి హాజరై పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గండీడ్, పెద్దవార్వల్, చిన్నవార్వల్ తదితర గ్రామాల్లో పాపన్నగౌడ్ చిత్రపటానికి గౌడకులస్తులు పూలమాల వేసి నివాళులర్పించారు.
మూసాపేట, ఆగస్టు 18: మండలంలోని పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో మాజీజెడ్పీటీసీలు ఇంద్రయ్యసాగర్, రామన్‌గౌడ్, మాజీఎంపీపీ కృష్ణయ్య పాల్గొన్నారు.
భూత్పూర్, ఆగస్టు 18: పాపన్నగౌడ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్‌గౌడ్ పేర్కొన్నారు. చౌరస్తాలో పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్‌రెడ్డి, నారాయణగౌడ్, చంద్రశేఖర్‌గౌడ్ పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ అర్బన్, ఆగస్టు 18: పాపన్నగౌడ్ జయంతిని బీసీ సమాజ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గ్రీన్ బెల్ట్‌లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీసీ సమాజ్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌సాగర్ ,కుమ్మరి సంఘం అధ్యక్షుడు బుగ్గన్న, జాండ్రసంఘం అధ్యక్షుడు మహేందర్, పద్మశాలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్ష్మీకాంత్ పాల్గొన్నారు.