మాగనూరు జూన్ 30 : నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం పనులకు ఇసుకను అక్రమంగా తరలిస్తే ఎంత మాత్రం సహించమని మాగనూరు గ్రామస్తులు రాఘవ కన్స్ట్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధులను హెచ్చరించారు. నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల నిర్మాణ పనులను చేపట్టేందుకు టెండర్ దకించుకున్న రాఘవ కన్స్ట్ట్రక్షన్ కంపెనీ భూత్పూర్ రిజర్వాయర్ నుంచి ఊటూరు పెద్ద చెరువుకు సాగునీటిని తరలించే క్రమంలో పైప్‌లైన్ నిర్మాణం కోసం మక్తల్ మం డలం కాచ్వార్ గ్రామ శివారులో ఏర్పాటు చేసిన సిమెంట్ పైపుల తయారీకి మాగనూరు పెద్దవాగు నుంచి ఇసుక రవాణా చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే రెండు రోజుల కిందట మాగనూరు పెద్దవాగులో ప్రభుత్వ అనుమతులు లేకుండా రోడ్డుమార్గం ఏర్పాటు చేసి టిప్పర్ల ద్వారా ఇసుకను తరలించేందుకు ప్రయత్నం చేశా రు.
గ్రామస్తులు అడ్డుకొని వాహనాలను వెనకి పంపించారు. శివారు వాగులో ఉద్రిక్తతలు నెలకొనడంతో ముందస్తు చర్యల్లో భాగంగా సోమవారం పోలీసు బందోబస్తుతో ఇసుకను తరలించేందుకు సంస్థ సిద్ధమైంది. గ్రామానికి పెద్ద సంఖ్య లో పోలీసులు చేరుకోవడంతో గ్రామస్తులు సైతం తమ వాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడితే ప్రజాప్రతినిధులు, అధికారులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించా రు. ఈ క్రమంలో పరిస్థితిని గ్రహించిన మక్తల్ సీఐ రామ్‌లాల్, మాగనూరు తాసీల్దార్ నాగలక్ష్మి, స్థానిక తాసీల్దార్ కార్యాలయంలో ఇటు గ్రామస్తులు, అటు రాఘవ కన్స్ట్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధులతో దాదాపు గంటపాటు సమావేశం నిర్వహించి ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ నిర్మాణం పనులకు ఆటంకం కలిగించవద్దని, శివారు వాగు నుంచి ఇసుకను తరలించేందుకు కంపెనీ సిబ్బందికి సహకరించాలని అధికారులు కోరగా అందుకు గ్రామస్తులు తిరసరించారు. మాగనూరు పెద్దవాగు నుంచి కొన్నాళ్లుగా ఇసుకను తరలిస్తుండడంతో ఈ ప్రాంతం మొత్తం ఎడారిగా మారిందని, భవిష్యత్తులో తమకు సాగునీరు, తాగునీటికి ఇబ్బందులు వస్తాయని తమ ఆవేదనను వినిపించారు.
ఇరుపక్షాల వాదనల అనంతరం తాసీల్దార్ కలుగజేసుకొని మండలంలోని వరూరు ఇసుక రీచ్ నుంచి ఎనభై శాతం, మాగనూరు పెద్దవాగు నుండి ఇర వై శాతం ఇసుకను తరలించుకోవాలని కంపెనీ ప్రతినిధులతో పేరొనడంతో అం దుకు సంస్థ ప్రతినిధులు సైతం తిరసరించారు. గంటపాటు పోలీసులు అధికారుల సమక్షంలో సమావేశం నిర్వహించి ఇరువర్గాల వారిని సముదాయించినప్పటికీ ఎవరికి వారు మొండిగా వ్యవహరించడంతో అధికారులు ఈ విషయాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని, శాంతి భద్రతలకు విఘాతం లేకుండా ప్రతిఒకరూ సహకరించాలని సూచించారు. ఇదిలా ఉండగా మాగనూరు పెద్దవాగు నుంచి ఇసుక తరలించే విషయంలో రా ఘవ కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించిన ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర మంత్రి, జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలతోనే మండల అధికారులు, పోలీసులు అత్యుత్సాహం చూపెడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. సమావేశంలో డీటీ సురేశ్‌కుమార్, ఎస్సై అశోక్‌బాబు, ఎంపీడీవో శ్రీనివాసులు, ఆర్ఐ శ్రీశైలం ఉన్నారు.