‘ఇసుకా.. ఇసుకా.. ఎందుకు తరలు తున్నావంటే.. మామూళ్లకు కక్కుర్తిపడే అధికారులు ఉంటే తరలనా’.. అందంట. నారాయణపేట జిల్లాలో పరిస్థితి అలా తయారైంది. చీకటి పడిందంటే చాలు ఇసుక మాఫీయా రెచ్చిపోతోంది. కృష్ణానదితో పాటు మాగనూరు పెద్దవాగు నుంచి గుట్టుచప్పుడు కాకుండా టిప్పర్లు, ట్రాక్టర్లలో జోరుగా తరలిస్తున్నారు. నిత్యం 20 నుంచి 30 టిప్పర్ల వరకు తోడేస్తున్నారు. అధికారులకు సమాచారం అందించినా స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్లపై బాజాప్తా ఇసుక వాహనాలు వెళ్తున్నా పోలీస్ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. ఇదంతా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుందని రైతులు ఆరోపిస్తున్నారు.
నారాయణపేట జిల్లా మాగనూరు, కృష్ణ, మరికల్ మండలాల్లో ఇసుక అక్రమ రవాణా నిత్యం రాత్రి అయితే చాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతున్నది. మాగనూరు పెద్దవాగు, కృష్ణానదిలో నుంచి పదుల సంఖ్యలో ట్రా క్టర్ల ద్వారా టిప్పర్ల ద్వారా తరలిస్తుండడంతో ఇ సుక అక్రమ రవాణాను ఆపేది ఎవరంటూ ప్రజల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాగనూరు మండలం పరిధిలోని దాసరిదొడ్డి, వరూర్ రీచ్‌ల ద్వారా ఆన్లైన్ పర్మిషన్ల పేరుతో పట్టపగలు ఇష్టానుసారంగా ట్రాక్టర్ల ద్వారా గుర్తించిన రీచ్‌ల దగ్గరలో డంపు వేసి రాత్రి అయితే చాలు 20నుంచి 30టిప్పర్ల ద్వారా మక్తల్ ఎమ్మెల్యే అనుచరులు ముఖ్య నాయకులు అంతా కలిసి మక్తల్ పోలీస్, రెవెన్యూ అధికారుల చేతులు తడుపుతూ టిప్పర్ల ద్వారా అక్రమంగా ఇసుక మహబూబ్‌నగర్, గద్వాల్, నారాయణపేట, మరికల్, దేవరకద్ర వైపు తరలిస్తున్నారని మాగనూరు, మక్తల్ మండలాల ప్రజ లు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా కృష్ణ మండ ల పరీవాహక ప్రాంతమైన ముడుమాల్, మురారిదొడ్డి గ్రామ సమీపంలోని కృష్ణానదిలో నుంచి రాత్రి 7 అయితే చాలు ఇసుక అక్రమ రవాణా జోరుగా సంబంధిత పోలీస్ రెవెన్యూ అధికారుల కనుసన్నల్లోనే కొనసాగుతున్నట్లు తెలుస్తున్నది. ఏకంగా జేసీబీ, హిటాచీల ద్వారా కర్ణాటక రాష్ట్రానికి చెందిన 10నుంచి 20సంఖ్యలో 12టైర్ల టి ప్పర్ల ద్వారా నిత్యం కర్ణాటక రాష్ట్రానికి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఇకడ కూడా ఎమ్మె ల్యే అనుచరులే ఉ న్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
మరికల్ మండలంలోని రాకొండ గ్రామంలోని ఊకచెట్టు వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతున్నది. ఈ చీకటి వ్యాపారానికి నారాయణపేట ఎమ్మెల్యే బంధువు హస్తం ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతున్నది. ఈ వాగు నుంచి నిత్యం అక్రమంగా ఇసుక రవాణా మహబూబ్‌నగర్, హైదరాబాద్ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒక భారత్ బెంచ్‌కు ముఖ్య నాయకుడి అనాధికార పీఏకు పదివేల రూపాయలు ముట్ట చెప్పాల్సి ఉంటుందని, అలా ముట్ట చెబితేనే ఇసుక అక్రమ రవాణా కొనసాగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ చీకటి వ్యాపారానికి పోలీస్ అధికారుల సహకారాలు కూడా ఉన్న ట్టు జోరుగా ప్రచా రం జరుగుతున్నది. స్థానికంగా ఉన్న పోలీసు, రెవెన్యూ అధికారులు ఇసుక అక్రమ రవాణా అడ్డుకట్టుకు ప్రయత్నించినా జిల్లాస్థాయి నుంచి వచ్చే ఒత్తిళ్లకు తలోగ్గుతున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఏదేవైనా నారాయణపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకులు అక్రమ దందాలపై భారీగా వసూళ్ల పర్వం చేపట్టినట్లు ప్రచారం జరుగుతుంది.
మాగనూరు మండలంలో గుర్తించి న ఇసుక రీచుల వద్ద ఇసుకను అక్రమం గా తరలించకుండా ఎస్ఆర్ఏలకు నైట్ డ్యూటీలు వేశాం. పోలీసులు కూడా మా ఎస్ఆర్ఏలకు తోడు ఉండేలా చూ డాలని ఎస్సైకి తెలిపాం. మాగనూరు శివారులో ఉన్నవాగు పరీవాహక ప్రాం తాల వారు ఇసుక అక్రమ తరలింపునకు పాల్పడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. తరలించకుండా బందోబస్తు
ఏర్పాటు చేయించాం.
-సురేశ్‌కుమార్, ఇన్చార్జి తాసీల్దార్, మాగనూరు