మక్తల్, జనవరి 7 : మక్తల్ నియోజకవర్గంలో కృష్ణానదిలో కాంగ్రెస్ నాయకులు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను డంప్ చేసి ఇతర ప్రాంతాలకు ఇసుకను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. రెవెన్యూ, పోలీస్‌శాఖ అధికారులు ఏ మాత్రం చర్యలు తీసుకోకుం డా చోద్యం చూస్తున్నారు అ నడానికి కృష్ణ మండలం గురజాల్ సిద్ధిలింగేశ్వర మఠం వెనుకాల భారీగా డంపు చేసిన ఇసుక డం పే నిదర్శనం. మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ మండలంలో కృష్ణానది పరీవాహక ప్రాంతంలోని గురజాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకు లు ఇసుకను అ క్రమంగా ర వా ణా చేసేందుకు వందలాది టిప్ప ర్ల ఇసుకను డంప్ చేశారు.
ఇసుక దోపిడీ కారణంగా భూగర్భజలాలు తగ్గిపోవడంతోపాటు నదీ పరీవాహక ప్రాంతంలో వ్యవసాయ పొలాలకు సాగునీరు అందే పరిస్థితి లేదని రైతులు రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా ఇసుక అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇసుక దోపిడీ విషయం తెలుసుకున్న మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం కృష్ణ మండలం గురజాల్ గ్రామ శివారులో అక్రమంగా నిల్వచేసిన ఇసుకడంప్తోపాటు కృష్ణానదిలో ఇసుకను తరలిస్తు న్న పలు ప్రదేశాలను పరిశీలించి రెవె న్యూ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న కృష్ణ తాసీల్దార్ శ్రీనివాసులు గురజాల స మీపంలో ఇసుక డంపులను పరిశీలించి సీజ్ చేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిట్టెం మా ట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా కాంగ్రెస్ పార్టీకి చెం దిన నాయకులు ఏం దోచుకోవాలనే దానిపైనే ప్రత్యేక దృష్టి సారించారు తప్పా, ప్రజల సమస్యలను పరిషరించడంలో ఏమాత్రం దృష్టి సారించలేదన్నా రు. మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ మండలంలోని కృషానదిలో యథేచ్ఛగా జ రుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై రెవె న్యూ, పోలీస్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఈ కారణంగానే కాంగ్రెస్ నా యకులు రెచ్చిపోయి రేయింబవళ్లు ఇసుకను అక్రమంగా నది నుంచి తోడి డంప్ చేసి రాత్రిల్లో ఇత ర ప్రాంతాలకు ఇసుకను తరలించి రూ. కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు.
నది తీర ప్రాంతంతోపాటు ఎకడ వాగులు, వంకలు కనపడినా కాం గ్రెస్ పార్టీ నాయకులు అక్కడ వాలి అక్రమ ఇసుక రవాణా కొనసాగిస్తుండడం వల్ల నదీతీరం, వాగు పరిసర ప్రాంతాల్లో సాగు చేసే పంటలకు సాగునీరు అందక రైతులు ఇబ్బందు లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పం దించి మక్తల్ నియోజకవర్గంలో జరుగుతు న్న ఇసుక అక్రమ రవాణాను అరికట్టి దో షులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇసుక దోపిడీపై రైతులతో కలిసి పెద్ద ఎత్తు న పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించా రు. మాజీ ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ నా యకులు శివరాజ్‌పాటిల్, శివప్ప, నర్సింహారెడ్డి, శ్రావణ్‌కుమార్ ఉన్నారు.