మరికల్ : ఛత్రపతి శివాజీ తనయుడు హిందూ సామ్రాట్ ఛత్రపతి శంభాజీ ( Sambhaji Maharaj ) జయంతి వేడుకలను బుధవారం మరికల్ మండల కేంద్రంలో బీజేపీ( BJP ) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శంభాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు మంగలి వేణుగోపాల్ మాట్లాడుతూ హిందూ సామ్రాజ్యం కోసం ప్రాణాలకు తెగించి పోరాటం చేసిన మహాయోధుడు శంభాజీ మహారాజ్ అని అన్నారు .
నేటి యువత శంభాజీని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షులు రమేష్, ఓబీసీ మోర్చా సోషల్ మీడియా ఇన్చార్జి నిఖిల్, దళిత మోర్చా మండల అధ్యక్షుడు చెన్నయ్య, మరికల్ మాజీ ఉపసర్పంచ్ శివకుమార్, రాజు, మాజీ వార్డు సభ్యులు రాజేష్, గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు.