అచ్చంపేట, ఏప్రిల్ 11 : వస్తున్నాం..వస్తున్నాం.. లింగమయ్య అంటూ భక్తుల నామస్మరణ మధ్య నల్లమల గిరులు పులకించాయి. చైత్ర పౌర్ణమి సందర్భంగా శుక్రవారం నుంచి సలేశ్వరం లింగమయ్య జాతర ఘనంగా ప్రారంభమైంది.
మూడు రోజుల పాటు (ఈనెల 11,12,13) కొనసాగనున్న ఈ జాతరకు మొదటి రోజే భక్తులు వేలాదిగా తరలివచ్చారు. సలేశ్వరం లింగమయ్య స్వామిని దర్శించుకునేందుకు నేపాల్ నుంచి నాగసాధువు శివనాగుబాబా వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. జాతరలో చెంచులు సంప్రదాయ పూజారులుగా వ్యవహరిసున్నారు.