తిమ్మాజిపేట, డిసెంబర్ 31 : ఉమ్మడి పాలమూరు జిల్లాలోని తిమ్మాజిపేట పేట స్టాక్ పాయింట్ పరిధిలో మద్యం అమ్మకాలు వందల కోట్లు దాటుతున్నాయి. మం గళవారంతో ముగిసిన 2024 సంవత్సరంలో తిమ్మాజిపేట టీజీఎస్బీసీఎల్ స్టాక్ పాయింట్ పరిధిలోని 153 మద్యం దుకాణాలు, 20బార్లలో రూ.1814 కోట్ల అమ్మకాలు జరిగాయి.
ప్రతినెలా దాదాపు రూ.150కోట్లకుపైగా అమ్మకాలు జరుగుతున్నాయి. తిమ్మాజిపేటలో స్టాక్పాయింట్ పరిధిలో గత సంవత్సర కాలంగా 27. 098 లక్షల బీరు కేసులు, 18.061లక్షల లిక్కరు కేసులు అమ్ముడైనట్లు స్టాక్ పాయింట్ అధికారులు తెలిపారు.