జడ్చర్ల, జనవరి 17 : బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డులో క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. బుధవారం కందులకు అత్యధికంగా క్విం టాకు రూ.8,822 ధర పలికింది. కందులు, ధాన్యం, వేరుశనగ, పత్తి, అమ్మకానికి వచ్చాయి. 36 క్వింటాళ్ల కందులు అమ్మకానికి రాగా, క్వింటాకు గరిష్ఠంగా రూ.8,822, కనిష్ఠంగా రూ.8,732, మధ్యస్తంగా రూ.8,792 ధర పలికింది.
అదేవిధంగా 78 క్వింటాళ్ల ఆర్ఎన్ఆర్ రకం ధాన్యం అమ్మకానికి రాగా, క్వింటాకు గరిష్ఠంగా రూ.3,126 ధర రాగా, కనిష్ఠంగా రూ.2,729, మధ్యస్తంగా రూ.2,818 ధర పలికింది. 9 క్వింటాళ్ల హంసధాన్యం అమ్మకానికి రాగా, క్వింటాకు గరిష్ఠంగా రూ.1,960 ధర పలికింది. 2,200 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా, క్వింటాకు గరిష్ఠంగా రూ.7,761, అదేవిధం గా 34 క్వింటాళ్ల పత్తి అమ్మకానికి రాగా, క్వింటాకు గరిష్ఠంగా రూ.6,789ధర పలికింది.