బిజినేపల్లి : జ్యేష్ఠ మాస పౌర్ణమి సందర్భంగా బుధవారం మండల పరిధిలోని వట్టెం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో (Venkateswara Swamy Temple) హోమం ( Homam ) , కలశాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. మట్పూరి నాగేశ్వర్, విజయ్ కుమార్ కైంకర్యంతో యజ్ఞాచార్యులు సముద్రాల శ్రీమన్నారాయణాచార్యుల ఆధ్వర్యంలో అర్చక బృందం శాస్త్రోక్తంగా హోమాలను నిర్వహించారు.
అంతకుముందు ఆలయంలో స్వామివారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తీర్థ ప్రసాదాలు ,అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక సభ్యులు సందడి ప్రతాప్ రెడ్డి, కొర్త చంద్రారెడ్డి, గుబ్బ సత్యనారాయణ, దెంది కృష్ణా రెడ్డి, జక్పా రెడ్డి, చెన్నకృష్ణా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.