గట్టు, జూలై 10 : కాంగ్రెస్ పార్టీ హామీలు అ మలు చేయకుండా మోసం చేస్తున్నదని, రేవంత్ సర్కారుపై నడిగడ్డ నుంచే రైతుల పోరాటం ప్రారంభిస్తామని శాట్ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్ అన్నారు. వానకాలం సాగు ప్రారంభమై నెల కావస్తున్నా పెట్టుబడి సాయాన్ని అందించలేని దుస్థితిలో ఉన్నదన్నారు. గట్టు, మల్దకల్ మండలాల్లో బుధవారం ఆయన పర్యటించి కా ర్యకర్తలు, రైతులతో సమావేశాలు నిర్వహించా రు. అనంతరం గట్టులో విలేకరులతో మాట్లాడా రు. ఏడు నెలల పాలనలో రూ.30 వేల కోట్ల అప్పు చేసిందని, అయినా రేవంత్సర్కారు రైతులకు మాత్రం ఖాళీ చేతులు చూపెడుతున్నదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు చూపుతున్న ప్రేమ.. రైతులపై పావు వంతై నా చూపించడం లేదని ఎద్దే వా చేశారు. కరెంట్ కోతలతో పదేండ్ల కిందటి పాత రోజు లు చూపిస్తున్నదని, కాంగ్రెస్ సర్కారు పంటలకు పట్టిన చీ డలా మారిందన్నారు. తక్షణమే రూ.2లక్షల రుణమాఫీ చేసి ఏడు నెలల వడ్డీతో కలిపి చెల్లించాలన్నారు. రాష్ట్ర రైతులోకం యావత్తు సర్కారు మోసంపై రగిలిపోతున్నదన్నారు. నడిగడ్డ నుంచే రేవంత్‌రెడ్డి సర్కారుపై రైతుపోరు షురూ అవుతున్నదని హెచ్చరించారు. పాలమూరు పర్యటనలో సైతం ఉమ్మడి జిల్లా రైతాంగం కోసం నిర్ధ్దిష్టమైన చర్యలు ప్రకటించకుండా, రొటీన్ రివ్యూ డ్రామా వేసి సీఎం వెళ్లిపోవడం సిగ్గుచేటన్నారు. సమావేశంలో నాయకులు బాసు హన్మంతునాయుడు, నాగర్‌దొడ్డి వెంకట్రాములు, కుర్వ పల్లయ్య, బస్వరాజు, హన్మంతురెడ్డి, మోనేశ్ మారోజ్, మల్లికార్జున్, రామకృష్ణ, శ్రీనివాసులు, రాజునాయుడు, నాగరాజు, కిష్టప్ప, సత్యం, వీరేశ్, నూరుపాషా, నల్లారెడ్డి, మక్బూల్, వెంకటేశ్, తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.
మల్దకల్, జూలై 10 : కాంగ్రెస్ ఏడు నెలల్లో అర్ధరూపాయి పని కూడా చేయలేదని, అలాంటి పార్టీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామనడం హాస్యాస్పదమని ఆంజనేయగౌడ్ విమర్శించా రు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మల్దకల్ మండలం కుర్తిరావులచెర్వులో బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలనుద్దేశించి మాట్లాడా రు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సొంత ప్ర యోజనాల కోసమే కాంగ్రెస్‌లో చేరారన్నారు. గులాబీ పార్టీకి మూడు సింహాలైన కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ఉండగా.. నాలుగో సింహామైన కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు.