Rythu bandhu | రైతుల పాలిట ఆపన్నహస్తంగా మారిన పథకం రైతుబంధు. సీఎం కేసీఆర్ సరిగ్గా ఐదేండ్ల కిందట ప్రారంభించిన ఈ పథకం ఫలితాలు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. ప్రతి వానకాలం, యాసంగి సీజన్లలో రైతులకు పంట పెట్టుబడుల కష్టాలు శాశ్వతంగా దూరమయ్యాయి. ఇప్పటి వరకు పది విడుతలుగా ప్రతి జిల్లాలో రూ.వందల కోట్లలో ప్రభుత్వం పెట్టుబడి సాయం అందజేసింది. ఫలితంగా సమైక్యపాలనలో కునారిల్లిన సేద్యం నేడు సంబురంగా సాగుతున్నది. ఈ బృహత్తర పథకంతో నాగర్‌కర్నూల్ జిల్లాలోనే ఇప్పటి వరకు రూ.3.236 కోట్లు సాయంగా అందింది.
నాగర్‌కర్నూల్, మే 10 (నమ స్తే తెలంగా ణ) : రైతులు పెట్టుబడుల కో సం చేయిచాచొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం విజయవంతంగా అమలవుతున్నది. ఎకరాకు రూ.5వేల చొప్పున ఆర్థిక సా యం అందుతున్నది. ఏటా వానకా లం, యాసంగి సీజన్లలో రూ.10 వేలు రై తుల ఖాతాలో జమ అవుతున్నాయి. 2018 మే 10వ తేదీన కరీంనగర్ జిల్లా హు జూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లి-ఇందిరానగర్ వద్ద సీఎం కేసీఆర్ రైతుబంధు పథకానికి శ్రీ కారం చుట్టారు. సీజన్‌కు రూ.4వేల చొప్పున.. రెండు పంటలకు కలిపి ఏటా రూ.8వేల చొప్పున ఆర్థిక సా యం జమ చేశారు.
కాగా, పెరిగిన ధరలను గుర్తించిన సీ ఎం కేసీఆర్ 2019-20 నుంచి ఎకరాకు రూ.వేయి చొ ప్పున పెంచడం విశేషం. ఇలా ఏటా రూ.10వేల ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నది. ప్రతి జిల్లాలో రూ.వందల కోట్లల్లో రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తున్నది. దీంతో రైతులు విత్తనాలు, ఎరువుల పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులు, దళారులను ఆశ్రయించడం తగ్గింది. ఈ పథకాన్ని ఐక్యరాజ్య సమితి సైతం ప్రశంసించింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని బృహత్తర పథకాన్ని సీఎం కేసీఆర్ అమలు చేస్తూ రైతులపై తనకున్న ఉదారతను నిరూపించుకొంటున్నారు. ఈ పథకం అమలు కాకముందు రైతులు విత్తనాలు కొనాలంటే వడ్డీ వ్యాపారులు, దళారులను ఆశ్రయించే పరిస్థితులు ఉండేవి. తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టుబడుల కోసం చేసిన అప్పులకు బదులుగా పండిన పంటను వ్యాపారులకు అమ్ముకోవాల్సి వస్తుండేది.
దీంతో రైతులకు మార్కెట్ ధరకు పంటను విక్రయించుకోలేక బాధపడేవారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు సరైన మద్దతు ధర లేకున్నా.. కనీసం వడ్డీ తీరితే చాలన్నట్లుగా ఉండేవారు. రైతుబంధు పథకంతో పెట్టుబడుల కష్టాలు శాశ్వతంగా తీరాయి. ఇప్పటివరకు ఐదేండ్లుగా పది విడుతల్లో రైతుబంధు ద్వారా ప్రభుత్వం ప్రతి జిల్లాకు రూ.వందల కోట్లలో సాయం అందింది. అలాగే రైతులకు 24 గంటల ఉచిత కరెంట్, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి చెరువులు, కుంటలను నింపడంతోపాటు కాల్వల ద్వారా పంటలకు సాగునీరు అందుతునది. రైతుభీమా, సబ్సిడీపై సకాలంలో ఎరువులు, విత్తనాల పంపిణీ, పంటలకు మద్దతు ధర కల్పించడం, కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించి గిట్టుబాటు ధరను అందిస్తున్నది.
ఇలా రైతులు పంటలు పండించడం నుంచి కొనే వరకూ రాష్ట్ర ప్రభుత్వం ముందుండి ప్రోత్సహిస్తున్నది. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతుబంధు, ఇతర పథకాలతో గ్రామాల్లో బీడుబడ్డ భూములు పచ్చగా మారాయి. వరి, వేరుశనగ, పత్తి, పప్పు, నూనె గింజల సాగుతో ఊళ్లోనే వ్యవసాయ పనులు దొరుకుతున్నాయి. ఫలితంగా రైతు కూలీలు, పేదల వలసలు తగ్గాయి. ఈ పథకం వల్ల ఉమ్మడి జిల్లాలో ఏటా సీజన్‌కు పది లక్షల మంది వరకు రైతులు లబ్ధి పొందుతున్నారు.
రైతుబంధు రాక ముం దు విత్తనాలు వేయాలంటే అప్పులు చేయాల్సి వస్తుం డె. నాకు ఐదెకరాలున్నది. వానలు కురువకుంటే వేసిన విత్తనాలు పోతాయని అప్పు తెచ్చేవాళ్లం. అప్పు తలుచుకుంటే భయమైతుండె. రైతుబంధు వచ్చినంక ఆ బాధ తీరింది. బ్యాంకు ఖాతాలో పడే డబ్బులతో విత్తనాలు, ఎరువులు కొనుక్కుంటున్న. ఎవరి వద్ద చేయి చాపి అప్పు అడిగే పరిస్థితులు లేవు. సీఎం కేసీఆర్ సారుకు ధన్యవాదాలు.
– బుద్ధారపు వెంకటయ్య, రైతు, అల్లాపూర్
రైతుబంధు పథకం తె చ్చిన సీఎం కేసీఆర్‌కు రైతులమంతా జీవితాంతం రు ణపడి ఉంటాం. 24 గం టల కరెంటు ఇస్తుండు. కా ల్వలకు నీళ్లు తెచ్చిండు. ఏ డాదికి రెండుసార్లు ఎకరా కు రూ.10 వేల సాయం అందిస్తుండు. దళారులు, వ్యాపారుల వద్దకు అప్పుల కోసం పరుగులు పెట్టే బాధలు తీరినయ్.
– జల్లెల మల్లయ్య, రైతు, తాడూరు