జడ్చర్లటౌన్, జనవరి 29 : క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. బాదేపల్లి ఉన్నత పాఠశాల మైదానంలో ఆదివారం ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన జిల్లాస్థాయి ఇంటర్ స్కూల్ ఫుట్‌బాల్ లీగ్ చాంపియన్‌షిప్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడారంగానికి ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చి నిధులను కేటాయిస్తున్నదని తెలిపా రు. ఆటల్లో రాణించే క్రీడాకారులకు అన్నివిధాలా ప్రోత్సాహం అందిస్తుందన్నారు. ప్రశాంత వాతావరణంలో ఆటలు ఆడి క్రీ డాస్ఫూర్తిని చాటాలని క్రీడాకారులకు సూ చించారు. అనంతరం కౌన్సిలర్ రఘురాం సౌజన్యంతో సీఎల్ఆర్ స్పోర్ట్స్ మీట్ టీషర్టులను క్రీడాకారులకు పంపిణీ చేశారు.
రమాసహిత సత్యనారాయణస్వామికి పూజలు
పట్టణంలోని రమాసహిత సత్యనారాయణస్వామిని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. సత్యనారాయణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణోత్సవంలో పాల్గొని తిలకించారు. ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింత న అలవర్చుకొని సన్మార్గంలో పయనించాలని సూచించారు.
అజ్మీర్ దర్గాకు చాదర్ సమర్పణ
రాజస్థాన్‌లోని హజ్రత్ మొయినొద్దీన్ చిష్తీ అజ్మీర్ దర్గా ఉర్సు సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చాదర్ సమర్పించారు. ఈ సందర్భంగా మతగురువుల సమక్షంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాష్ట్రంలో మరిం త అభివృద్ధి జరగాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
జడ్చర్ల మండలంలోని పోలేపల్లికి చెంది న లావణ్యకు వైద్యఖర్చుల నిమిత్తం సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన రూ.59,500 చెక్కును ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆపత్కాలంలో పేదలకు సీఎం కేసీఆర్ అన్నివిధాలా అండగా నిలుస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, ము న్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచులు, ముడా డైరెక్టర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ధ్యానంతో మానసిక ప్రశాంతత
మిడ్జిల్, జనవరి 29 : ధ్యానంతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని రాణిపేటలో ధ్యాన పిరమిడ్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజూ ధ్యానం, యోగా చేయడంవల్ల మానసిక ఒత్తిడి దూరం కావడంతోపాటు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ప్రతిఒక్కరూ ధ్యా నం, యోగా చేయాలని సూచించారు. అం తకుముందు గ్రామంలో ఏర్పాటు చేసిన వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. ఆట ల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని చాటాలని సూచించా రు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మన్ యాద య్య, సర్పంచ్ నిరంజన్, పీఏసీసీఎస్ చైర్మ న్ శ్రీనివాస్‌రెడ్డి, రైతుబంధు సమితి మం డల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, మాజీ జెడ్పీటీసీ రబ్బానీ, నాయకులు బాలు, పాండు, రామ్మోహన్, జంగిరెడ్డి, కృష్ణ, అల్వాల్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, వెంకటయ్య పాల్గొన్నారు.
ఉపసర్పంచ్ కుటుంబానికి పరామర్శ
రాజాపూర్, జనవరి 29 : మండలకేంద్రానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, ఉపసర్పంచ్ శ్రీనివాస్ తండ్రి సహదేవయ్య ఇటీవల మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆదివారం రాజాపూర్‌కు వచ్చి బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. ముందుగా సహదేవయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, ప్రధానకార్యదర్శి నరహరి, సర్పంచుల సంఘం మం డల అధ్యక్షుడు బచ్చిరెడ్డి, కోఆప్షన్ సభ్యుడు అల్తాఫ్, ఏఎంసీ డైరెక్టర్ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.