మాగనూరు కృష్ణ : ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని ఆర్టీసీ బస్సు ( RTC Bus ) బలంగా ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మాగనూరు కృష్ణ మండలం టై రోడ్ సమీపంలో చోటుచేసుకుంది . స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పెగడబండ గ్రామానికి చెందిన అంజప్ప (38) కర్ణాటక రాష్ట్రంలోని దేవసూర్లో పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై వస్తుండగా తెలంగాణ సరిహద్దు చెక్ పోస్ట్ తైరోడు పెట్రోల్ బంక్ సమీపంలో ఆర్టీసీ బస్ ఢీ కొట్టింది.
ద్విచక్ర వాహనంపై వెళ్తున్నఅంజప్పకు తీవ్ర గాయాలు కావడంతో అంబులెన్సులో కర్ణాటక( Karnataka) రాష్ట్రం రాయచూరు జిల్లా కేంద్రంలోని రిమ్స్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడని వైద్యులు తెలిపారు . అంజప్ప భార్య శంకరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీద్ తెలిపారు.