మహబూబ్ నగర్ : పంచాయతీ ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ ( BRS ) ప్రభంజనం స్పష్టంగా కనిపించిందని మాజీ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి ( Lakshma Reddy ) అన్నారు. రాష్ట్రంలో నలభై శాతం సర్పంచ్ స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకుందని వెల్లడించారు. జడ్చర్ల నియోజకవర్గం నవాబ్ పేట మండల కేంద్రంలో నూతనంగా విజయ సాధించిన బీఆర్ఎస్ సర్పంచులను సోమవారం సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలో లేకపోయినా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదించారు. వెల్లడించారు. ఓడిపోయిన వారు అధైర్యపడొద్దని, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. పార్టీ కష్టకాలంలో పోరాడి విజయం సాధించిన వారికి అభినందనలు తెలిపారు. గ్రామాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో చేపట్టిన అభివృద్ధి పనులు మాత్రమే కనిపిస్తున్నాయని వివరించారు.

కాంగ్రెస్ రెండేళ్లలో గ్రామాలకు చేసిందేమీ లేదన్నారు. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో విజయం సాధించడం ప్రభుత్వం పాలనా వైఫల్యానికి నిదర్శనమన్నారు. ముఖ్యంగా జడ్చర్ల నియోజకవర్గంలో ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ సత్తా చాటిందన్నారు. మొదటి విడతలో అధికార పార్టీ కంటే ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుందని తెలిపారు. గ్రామాల అభివృద్ధి కి నిరంతరం కృషి చేయాలని నూతనంగా గెలిచిన సర్పంచ్ లకు పిలుపునిచ్చారు.