కొల్లాపూర్, ఏప్రిల్ 21 : బీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కొల్లాపూర్ పట్టణంలో ఆదివారం మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో మినీ స్టేడియంలో క్రీడాకారులు, సీనియర్ సిటిజన్లను కలిసి నాగర్‌కర్నూల్ ప్రాంతంలో దశాబ్దాలుగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టణంలో కూరగాయల మార్కెట్లో చిరువ్యాపారులను కలిసి ఈ నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మార్కెట్లోకి లోడ్‌తో వచ్చిన ట్రాన్స్‌పోర్టు లారీ వద్దకు వెళ్లి ప్రవీణ్‌కుమార్ హమాలీగా అవతారమెత్తారు. అలాగే బస్టాండ్‌లో ఆర్టీసీ ఉద్యోగులు, ప్ర యాణికులతో ఆయన మాట్లాడారు.
పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా, గాంధీ చౌరస్తా, రామాలయం చౌరస్తాలో అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు కోరుతూ కారు గుర్తుకు ఓట్లు వేసి తనను ఎంపీగా గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం బస్టాండ్ వద్ద ఓ హోటల్లో దోశవేసిన ఆయన అందరినీ నవ్వుల్లో ముంచెత్తారు. తనను ఎంపీగా గెలిపిస్తే అన్ని వర్గాల వారి సమస్యలను తీర్చడంతోపాటు ఈ ప్రాంతం అభివృద్ధికి తాను శక్తివంచలేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సోషల్ మీడి యా ఇన్చార్జి రంగినేని అభిలాష్‌రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కాటం జంబులయ్య, తెలంగాణ మలిదశ ఉద్యమనాయకుడు కట్టాశ్రీనివాసులు, ఎంపీటీసీ శంకర్‌నాయక్, కౌన్సిలర్లు పస్పులకృష్ణ, కృష్ణామూర్తి, సింగిల్‌విండో డైరెక్టర్ నర్సిం హ, బీఆర్ఎస్ నాయకులు బ్రహ్మయ్య, విష్ణుతేజ, మహేశ్, వెంకటేశ్, రవినాయక్, శేఖర్,విష్ణువర్ధన్ తది తరులు ఉన్నారు.