
మహబూబ్‌నగర్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ ఏర్పాటుకు ముందు తాగునీటికి కూడా నోచుకోక మహబూబ్‌నగర్‌లో నివాసం ఉండే పరిస్థితి లేదు. చాలా మంది వివిధ ప్రాంతాల్లో ఉంటూ ఇక్కడికి వచ్చి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించేవారు. పట్టణంలో నూతన ఇండ్ల నిర్మాణం పెద్దగా ఉండేదికాదు. ఉమ్మడి జిల్లా కేంద్రమైనా.. ఇ క్కడ ఉండేందుకు సౌకర్యాలు పెద్దగా లేకుండె. తెలంగాణ ఏర్పడిన తర్వాత పట్టణంలో క్ర మంగా రూపురేఖలు మారుతూ వచ్చాయి. 70 ఏండ్లలో జరగని అభివృద్ధి సాధ్యమైంది. సేద తీరేందుకు కేసీఆర్ అర్బన్ ఎకో పార్కు, పట్టణంలో అనేక పార్కులు, మినీ ట్యాంక్‌బండ్, వైద్యం కోసం నూతనంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల, దానికి అనుబంధంగా సకల సదుపాయాలతో ప్రభుత్వ జనరల్ దవాఖాన, సెంట్ర ల్ లైటింగ్ సిస్టం, సుమారు 4 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు, మిషన్ భగీరథ ద్వారా నిత్యం ఇంటింటికీ శుద్ధజలం, డ్రైనేజీలు, సీసీరోడ్లు, బైపాస్ రోడ్డు, జడ్చర్ల-మహబూబ్‌నగర్ డబు ల్ రోడ్డు, ఐటీ పార్కు నిర్మాణం.. ఇలా ఒక్కటేమిటీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఒకప్పటి మహబూబ్‌నగర్ ఇదేనా అనే లా మార్పు జరిగింది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతోనే పట్టణం ఇంతలా అభివృద్ధి చెందుతుందని అనేకమార్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు.
మహబూబ్‌నగర్ రోడ్ మ్యాప్..
బెస్ట్ టౌన్‌గా మారుస్తాం..
రాష్ట్రంలో నెంబర్‌వన్ పట్టణంగా మహబూబ్‌నగర్‌ను తీర్చిదిద్దుతాం. నిత్యం మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నాం. ఇరుకుగా ఉ న్న రహదారులను విశాలంగా మార్చాం. పట్టణాన్ని భవిష్యత్‌లో హైదరాబాద్‌ను తలదన్నేలా మారు స్తాం. అదే తలంపుతో పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నాం. భవిష్యత్‌లో మహబూబ్‌నగర్ ఎలా ఉండాలో రోడ్ మ్యాప్ తయారు చేయాలని నిర్ణయించుకున్నాం. ప్రతి అధికారి వారి శాఖ ద్వారా చేపట్టేందుకు ఆస్కారమున్న అన్ని పనులపై త్వరలోనే జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తాం. మహబూబ్‌నగర్‌ను బెస్ట్ టౌన్ అనేలా తీర్చిదిద్దుతాం.
‘తెలంగాణ ఏర్పాటుకు ముందు మహబూబ్‌నగర్ పట్టణానికి వచ్చేందుకు బంధువులు భయపడేవారు. స్థానికులు తాగునీటికి ఇబ్బందులు పడేవారు. ఇక్కడ పనిచేసే ఉద్యోగస్తులు స్థానికంగా కాకుండా వివిధ ప్రాంతాల్లో ఉండేవారు. ఏ విధంగా చూసినా మహబూబ్‌నగర్ అంటేనే అమ్మో.. అనే పరిస్థితి ఉండేది.’
‘ప్రస్తుతం.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పట్టణ రూపురేఖలు మారిపోయాయి. 14 రోజులకు ఒకసారి వచ్చే తాగునీరు.. నిత్యం శుద్ధజలం అందించే స్థాయికి చేరుకున్నది. ఇరుకైన రోడ్లతో ఇబ్బందులు పడిన జనానికి ఇప్పుడు విశాలమైన రోడ్లు స్వాగతం పలుకుతున్నాయి. కనీస వైద్యానికి నోచుకోని పాలమూరు.. నేడు సూపర్‌స్పెషాలిటీ వైద్యానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇది సరికొత్త మహబూబ్‌నగర్ అని చాటిచెప్పేలా అభివృద్ధి జరుగుతున్నది. అందుకే ఇది నయా.. మహబూబ్‌నగర్.’
ఇప్పటికే ఊహించని విధంగా అభివృద్ధి చెందిన మహబూబ్‌నగర్‌ను మరింత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నారు. అన్ని రంగాల్లోనూ నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ నే తృత్వంలో కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికప్పుడు చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టితో ముందుకెళ్తున్నారు. అన్ని వనరులతో అలరారుతున్న మహబూబ్‌నగర్‌ను హైదరాబాద్ తరహాలో మార్చేందుకు కంకణం కట్టుకున్నారు.