జడ్చర్ల, మే 21 : బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో ఆర్ఎన్ఆర్ ధాన్యానికి అత్యధికంగా క్వింటా కు రూ.2,480 ధర పలికింది. మంగళవారం మార్కెట్కు ఆర్ఎన్ఆర్ ధాన్యంతోపాటు ఆముదాలు, మొక్కజొన్న అమ్మకానికి రాగా ఆర్ఎన్ఆర్ రకానికి గరిష్ఠంగా క్వింటాకు రూ.2,480, కనిష్ఠంగా రూ. 1,909, మధ్యస్తంగా రూ.2,169 ధర పలికింది. మొక్కజొన్నకు క్వింటాకు రూ.2,278, ఆముదాలు క్వింటాకు గరిష్ఠంగా రూ.5,540 ధర పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.