మహబూబ్‌నగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 22: ఇంటర్మీడియట్ ఫలితాల్లో రిషి విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అద్భుతమైన ఫలితాలు సాధించి పాలమూరు విద్యాఖ్యాతిని పెంచారని ఆ కళాశాల చైర్పర్సన్ చంద్రకళ, అకాడమిక్ చీఫ్ అడ్వైజర్ వెంకటయ్య తెలిపారు. మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో 470 మార్కులకుగాను ఎం.భావన 468 సాధించగా.. ఏడుగురు 467 మార్కులు సాధించారన్నారు.
బై పీసీలో 440 మార్కులకు మలిహా కహేకషా 438 మా ర్కులు సాధించగా ముగ్గురు విద్యార్థులు 437, మరో ము గ్గురు 436 మార్కులు సాధించారని తెలిపారు. రెండో సంవత్సరం ఎంపీసీలో వెయ్యి మార్కులకు టి.మేఘన 993 మార్కులు సాధించగా ఐదుగురు 990 మార్కులు సాధించారన్నారు.
బైపీసీలో వెయ్యి మార్కులకు మలీహా తహనీయత్ 992 మార్కులు సాధించగా ఐదుగురు వి ద్యార్థులు 990 మార్కులు సాధించారన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అకాడమిక్ చీఫ్ అడ్వైజర్ వెంకటయ్య అభినందించారు. కార్యక్రమంలో అకాడమిక్ డీన్ లక్ష్మారెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ డీన్ భూపాల్‌రెడ్డి, ప్రిన్సిపాల్ ప్రసన్నలక్ష్మి, రాఘవేంద్రరావు పాల్గొన్నారు.