అంగన్వాడీ కేంద్రంలో పేలిన రైస్‌కుక్కర్
అంగన్వాడీ కేంద్రం లో రైస్ కుక్కర్ పేలి నలుగురు చిన్నారులతోపాటు ఒక బాలింతకు తీవ్ర గాయాలైన ఘట న సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో చోటుచేసుకుంది. కొల్లాపూర్‌లో మున్సిపాలిటీలోని 10వ వార్డులో ఉన్న 18వ అంగన్వాడీ కేంద్రంలో మధ్యాహ్న భోజన సమయంలో ఆయా నిర్లక్ష్యంతో చిన్నారులను రౌండ్‌గా కూర్చొపెట్టి మధ్యలో కుక్కర్ చల్లగా కాకముందే వేడి రైస్ కుక్కర్‌ను ఓపెన్ చేయడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు బాధిత కుటుంబ సభ్యు లు ఆరోపిస్తున్నారు.
- నలుగురు చిన్నారులతోపాటు బాలింతకు తీవ్ర గాయాలు
కొల్లాపూర్, జూలై 6 : అంగన్వాడీ కేంద్రం లో రైస్ కుక్కర్ పేలి నలుగురు చిన్నారులతోపాటు ఒక బాలింతకు తీవ్ర గాయాలైన ఘట న సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో చోటుచేసుకుంది. కొల్లాపూర్‌లో మున్సిపాలిటీలోని 10వ వార్డులో ఉన్న 18వ అంగన్వాడీ కేంద్రంలో మధ్యాహ్న భోజన సమయంలో ఆయా నిర్లక్ష్యంతో చిన్నారులను రౌండ్‌గా కూర్చొపెట్టి మధ్యలో కుక్కర్ చల్లగా కాకముందే వేడి రైస్ కుక్కర్‌ను ఓపెన్ చేయడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు బాధిత కుటుంబ సభ్యు లు ఆరోపిస్తున్నారు.
ప్రమాదంలో చిన్నారులతోపాటు ఆరు నెలల బాబుతో పౌష్టికాహారం తెచ్చుకునేందుకు వెళ్లిన బాలింత బిజ్జ సైదులుకు తీవ్ర గాయాలయ్యాయి. రెగ్యులర్ అంగన్వాడీ టీచర్ లేకపోవడంతో పాటు ఆయాగా ఉన్న బాలమ్మ స్థానంలో ఆమె కుమార్తె చెన్నమ్మ ఆయాగా విధులు నిర్వర్తిస్తుందని కాలనీ వాసులు తెలిపారు. ప్రమాద సమయంలో అంగన్వాడీ కేంద్రంలో అధికారికంగా విధులను నిర్వహించాల్సిన అంగన్వాడీ టీచర్, ఆయాలు ఇద్దరు కేంద్రంలో లేర ని తెలుస్తోంది.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భానుప్రియ, గణేశ్లతో పాటు మరో ఇద్దరు చిన్నారులను ప్రభుత్వ దవాఖానకు తరలించగా వైద్యులు చికిత్సలు అందించారు. వార్డు కౌన్సిలర్ బోరేల్లి మహేశ్ గాయపడిన చిన్నారులను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గతంలో అంగన్వాడీ కేంద్రం నిర్వహణ సరిగా లేదని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతోనే ఇప్పుడు జరిగిన ప్రమాదానికి కారణంమైందని బాధిత కుటుంబ సభ్యుడు శివకుమార్ ఆరోపించారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

