గద్వాల, జనవరి 27 : ప్రభుత్వం ప్రవేశపెట్టిన సం క్షేమ పథకాలను ప్రజలకు అందించి జిల్లాను అభివృ ద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తామని వైద్య, ఆరో గ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో విద్య, వై ద్య, ఇరిగేషన్, నీటిపారుదల శాఖ అధికారులతో స మీక్ష నిర్వహించారు. సమావేశంలో జెడ్పీచైర్ పర్సన్ సరిత, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, అలంపూర్ ఎ మ్మెల్యే విజయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభు త్వం కృషి చేస్తున్నదన్నారు. వక్ఫ్ భూములు, ప్రభుత్వ భూములకు సంబంధించి రికార్డులు ఉండాలన్నారు. దవాఖానల్లో అందుతున్న వైద్యం, రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జి ల్లాలోని ప్రాజెక్టులు, సాగునీటి వివరాలపై ఆరా తీ శారు. మూడేండ్లల్లో ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించారని ఇరిగేషన్ శాఖ అధికారులను అడిగారు.
గట్టు ఎత్తిపోతల, జూరాల ప్రాజెక్టు, నెట్టెంపాడు, ఆర్డీఎ స్ ప్రాజెక్టులకు సంబంధించి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేయాలని ఆదేశించారు. రైతులు, ప్ర జలకు విద్యుత్ సమస్య లేకుండా చూడాలని కలెక్టర్ కు సూచించారు. అధికారులు బాధ్యతాయుతంగా ప ని చేసి ప్రభుత్వానికి, జిల్లాకు మంచి పేరు తేవాలన్నా రు. విద్య, వైద్యంపై అధికారులు నిర్లక్ష్యం వహించొద్దని హెచ్చరించారు. రెవెన్యూ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. అనంతరం దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తొమ్మిది మంది దివ్యాంగులకు స్కూటీలు పంపిణీ చేశారు. సమావేశంలో కలెక్టర్ సంతోష్, ఆర్డీవో చంద్రకళ, అదనపు కలెక్టర్లు శ్రీనివాసులు, అపూర్వచౌహాన్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రిని కలిసిన ఎమ్మెల్యే బండ్ల
జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి దామోదర రాజనర్సింహను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పూలబొకే అందజేశారు. దౌదర్పల్లి దర్గా శివారులో నిర్మిస్తున్న 300 పడకల దవాఖాన నిర్మాణ పనులను మంత్రితో కలిసి పరిశీలించారు. పనులు చివరి దశకు వచ్చాయని, మౌలిక వసతుల కల్పనకు నిధులు విడుదల చేయాలని ఎమ్మె ల్యే మంత్రిని కోరారు. కాగా, బీపీఎల్ కింద పట్టాలు పొందిన లబ్ధిదారులు మంత్రిని కలిశారు. తమకిచ్చిన స్థలంలో దవాఖాన, కళాశాలల నిర్మాణం చేపట్టారని, కానీ తమకు ఇప్పటివరకు స్థలం చూపలేదన్నారు. లబ్ధిదారులకు న్యాయం చేస్తామని, దవాఖాన నిర్మాణానికి సహకరించాలని మంత్రి కోరారు. కార్యక్రమం లో జెడ్పీచైర్‌పర్సన్ సరిత, మున్సిపల్ చైర్మన్ కేశవ్, మాజీ మంత్రి చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీధర్‌గౌడ్, ఎంపీపీలు రాజారెడ్డి, ప్రతాప్‌గౌడ్, జెడ్పీటీసీలు ప్రభాకర్‌రెడ్డి, రాజశేఖర్, నాయకులు కృష్ణారెడ్డి, రామన్‌గౌడ్, రాజీవ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జోగుళాంబ సాక్షిగా ఆరు గ్యారెంటీల అమలు
జోగుళాంబ దేవి సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఐదో శక్తిపీఠమైన అలంపూర్‌లోని జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర ఆలయాలను మంత్రి దర్శించుకున్నారు. అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా ఆలయాల్లో ప్రత్యేక పూజ లు చేశారు. ఆలయ విశిష్టతను వివరించి తీర్థప్రసాదాలు అందించి సన్మానించారు. అనంతరం అలంపూర్ చౌరస్తాలో నూతన వంద పడకల దవాఖాన భ వనాన్ని ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, కలెక్టర్ సంతోష్‌తో కలిసి మంత్రి పరిశీలించారు.
జనరల్ వార్డు, ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లి కల్పించాల్సిన వసతులపై అధికారులను అడిగి తె లుసుకున్నారు. త్వరలోనే వైద్యులు, సిబ్బందిని నియమించి వైద్యసేవలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అలాగే ఎర్రవల్లి చౌరస్తా మండల నూతన గ్రామపంచాయతీ భవనాన్ని సర్పంచ్ రవితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే రోజుల్లో దేశంలో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీల్లో రెండు అమలు చేశామని, మిగిలినవి అమలు చేస్తామన్నారు. వారి వెంట డీఎంహెచ్ వో శశికళ, అలంపూర్ దవాఖాన సూపరింటెండెంట్ సయ్యద్‌బాషా, తాసీల్దార్లు వెంకట్రావు, నందిని, నాయకులు ఉన్నారు.
నినాదాలతో మంత్రి అసహనం
జోగుళాంబ ఆలయాలను మంత్రి రాజనర్సింహ దర్శించుకున్న అనంతరం కాంగ్రెస్ శ్రేణులు జై సంప త్, జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి వర్గీయులు జై చల్లా అంటూ నినదించారు. దీంతో మం త్రి దా మోదర రాజనర్సింహ తీవ్ర అసహనానికి గురయ్యా రు. ఆలయ పరిసరాల్లో నినాదాలు ఎందుకు చేస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలను నిలువరించారు.