గద్వాల : జిల్లాలోని ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడు భారత రక్షణ నిధికి (National Defence Fund) రూ. లక్ష విరాళాన్ని అందజేశాడు. వడ్డేపల్లి మండలం కోయిల దిన్నె గ్రామానికి చెందిన గోరంట్ల లక్ష్మీకాంతా రెడ్డి( Lakshmikantha Reddy) అనే రైతు,విశ్రాంత ఉపాధ్యాయుడిగా సమాజ సేవలో పాల్గొంటున్నారు. రైతు భరోసా పథకం కింద తన బ్యాంకు ఖాతాలో జమైన రూ. లక్షను సోమవారం ఐడీఓసీ సమావేశం హాల్లో జాతీయ రక్షణ నిధి కింద కలెక్టర్ బీఎం సంతోష్‌కు అందజేశారు.
దేశ రక్షణ కోసం నిరంతరం సాహసంగా సేవలందిస్తున్న భారత సాయుధ దళాలను అహర్నిశలు కృషి చేస్తున్నారని దాత అన్నారు. లక్ష్మీకాంతారెడ్డి సేవా స్ఫూర్తిని అందరికీ ప్రేరణగా నిలవాలని కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా దాతను అభినందించారు.