అమ్రాబాద్, అక్టోబర్ 1 : అమ్రాబాద్ టై గర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో సఫారీ యాత్ర షురూ అయ్యింది. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ, అటవీ శాఖాధికారులతో కలిసి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఫర్హాబాద్ ముఖద్వారం నుంచి ప్రా రంభించారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ ఏటీఆర్‌ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చ ర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
జంగల్ సఫా రీ యాత్రలో వృక్షజాలం, జంతుజాలం గు రించి పర్యాటకులకు వివరిస్తూ యాత్ర ముం దుకు సాగుతుందని వివరించారు. అనంత రం అటవీ శాఖాధికారులు మాట్లాడుతూ స ఫారీ వాహనంలో ఒక నేచర్గైడ్ ఉండి అడ వి, సంపద, ప్రకృతి అందాల గురించి వివరిస్తారని తెలిపారు. అనంతరం శ్రీశైలం మల్ల న్న దర్శనానికి మంత్రి బయలుదేరారు. కా ర్యక్రమంలో అటవీశాఖ అధికారులు, సిబ్బం ది, పర్యాటకులు పాల్గొన్నారు.