నాగర్కర్నూల్, ఏప్రిల్ 13 : డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి అనుసంధానం చేస్తూ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, అందుకు త మ భూములను బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు అధికారులు యత్నిస్తున్నారని, మా జీవనాధారమైన భూ ములను ఇవ్వమని వెల్దండ మండలం అజిలాపురం గ్రా మానికి చెందిన రైతులు సోమవారం నాగర్కర్నూల్ కలెక్టరేట్లోని ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు.
మా గ్రామ పరిధిలో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కింద శివన్నగూడెం వైపు సాగు, తాగునీటి అవసరాలకోసం కాల్వ ని ర్మాణం చేపట్టారని, ఆ కాల్వ నిర్మాణానికి తాము పూర్తిగా సహకరించామన్నారు. కానీ అదే కాల్వకు అనుసంధానం గా మాగ్రామంలో రిజర్వాయర్ నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని, ఇందుకోసం మా భూములను బలవంతంగా లాక్కునేందుకు పూనుకుంటుందన్నారు. రిజర్వాయర్ చేపడితే మొత్తం 186.30 ఎకరాల భూమిని కోల్పోతామని, ప్రభుత్వాధికారులు మా సమ్మతి లేకుండా మాపై ఒత్తిడి తీసుకొస్తూ మా భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ భూములతోనే మా కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయన్నారు.
గతంలో గ్రామసభ నిర్వహిస్తే తామంతా మాకు రిజర్వాయర్ అవసరం లేదని స్పష్టంగా తెలియచెప్పినా, వినతిపత్రం అందజేసినా మా అభిప్రాయాలను పట్టించుకోకుండా అధికారులు సభను ముగించారని ఆ వినతిలో పేర్కొన్నారు. మా భూములు రిజర్వాయర్ కింద మునిగిపోతే పూర్తిగా జీవనోపాధి కోల్పోయి నిరాధారులమవుతామని, ఈ నిర్మాణాన్ని నిలిపి వేయాలని వారు ప్రభుత్వా న్ని కోరుతూ కలెక్టర్కు ఇచ్చిన వినతిలో పేర్కొన్నారు. అం తకుముందు కొద్దిసేపు కలెక్టరేట్ ఆవరణలో నిరసన తెలిపారు.