అచ్చంపేట, ఏప్రిల్ 21 : దోమలపెంట శ్రీశైలం ఎడమగట్టు (ఎస్ఎల్బీసీ) టన్నెల్లో జరిగిన ప్రమాదంలో మిగిలిన ఆరుగురి మృతదేహాల వెలికితీతకు అన్వేషణ ముగిసింది. ఎస్ఎల్బీసీ టన్నెల్ లో ప్రమాదం జరిగి సోమవారం నాటికి 59రోజు లు పూర్తయ్యింది. ఆరుగురి మృతదేహాలు డేంజర్జోన్లోనే ఉన్నాయని భావిస్తున్నారు. డేంజర్ జోన్లో తవ్వకాలు జరుపడానికి అవకాశం లేనందున అక్కడివరకు తవ్వకాలు జరిపి మృతదేహాల కోసం అన్వేషణ చేసినా ఫలితం లేకుండాపోయిం ది. దీంతో మిగిలిన డేంజర్‌జోన్ 43మీటర్లు పరిధి లో మృతదేహాలు ఉంటాయని అంటున్నారు.
డేం జర్జోన్లోకి వెళ్తే సహాయక సిబ్బంది ప్రాణాలకే ముప్పు కావడంతో ఆశలు వదిలేశారు. డేంజర్ జోన్లోకి వెళ్లలేని ప్రమాదకర పరిస్థితి ఏర్పడడం తో మృతదేహల వెలికితీత ఎలా? అనేది ఈ నెల 24న హైదరాబాద్‌లో జరిగే టెక్నికల్, నిపుణుల కమిటీ తేల్చనున్నది. అంతవరకు టన్నెల్లో మిగిలిన మట్టి, బురద, స్టీల్, రాళ్లు తొలగింపు పనులు కొనసాగించనున్నారు. అయితే మృతదేహాల కోసం అన్వేషణ డేంజర్‌జోన్ మినహ మిగిలిన ప్రదేశాల్లో ముగిసింది. టెక్నికల్ కమిటీ తదుపరి చర్యలపై సమీక్షించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నది.
టన్నెల్ లోపల చివరనా 43మీటర్లు డేంజర్ జోన్ గా గుర్తించారు. అక్కడ డేంజర్‌జోన్‌గా బోర్డుపెట్టి కంచె ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 58రోజులుగా రెస్యూ సిబ్బంది టన్నెల్ లోపల శ్రమించి 261మీటర్ల వరకు శిథిలాలు, బండరాళ్లు, మట్టి, బురద, టీబీఎం మిషన్ విడి భాగాలు, స్టీల్ కత్తిరింపు, కన్వేయర్బెల్టు, లోకోట్రైన్ ద్వారా బయటకు తరలించా రు. కన్వేయర్ బెల్టును పునరుద్ధరించి శిథిలాలు బయటకు తరలించారు. ఇప్పటికే చాలా మంది సిబ్బంది వెళ్లిపోయారు. ప్రస్తుతం 180 నుంచి 200 మంది వరకు రెస్యూ సిబ్బంది మాత్రమే ఉన్నారు. ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి వ్యక్తిగత పనుల నిమిత్తం ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం.
ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఫిబ్రవరి 22న జరిగిన ప్రమాదంలో 8మంది చిక్కుకొని సజీవసమాధి అ య్యారు. వారికోసం కేంద్ర, రాష్ర్టాలకు 12 విభాగాలకు చెందిన 600మంది మూడు షిప్టులుగా సహాయక బృందాలు రెస్యూ ఆపరేషన్ కొనసాగించారు. ఈక్రమంలో 16వ రోజు గురుప్రీత్‌సింగ్ మృతదేహం లభ్యంకాగా 33వ రోజు జేపీ కంపెనీ ఇంజినీర్ ఉత్తరప్రదేశ్కుచెందిన మనోజ్‌కుమార్ మృతదేహాం లభ్యమైంది. మిగిలిన ఆరుగురి మృతదేహాల కోసం నిరంతరం అన్వేషణ కొనసాగింది. మానవ అవశేషాలను గుర్తించడంలో దిట్ట అయిన కేరళ ప్రత్యేక జాగీలాలు క్యాడవర్ డాగ్స్ రంగంలోకి దిగిన పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. సింగరేణి, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, హైడ్రా, దక్షిణమధ్య రైల్వే, ర్యాట్‌హోల్ మైనర్స్ రెస్యూ బృందాలు కీలకంగా పనిచేశాయి.
రాష్ట్ర సరిహద్దులు దాటి వచ్చి టన్నెల్ ప్రమాదంలో మృతిచెందిన కార్మికులు, ఇంజినీర్లు, మిషన్ ఆపరేటర్ల కుటుంబాలు చివరికి కడసారి చూపుకోసం నోచుకోలేకపోయారు. ఎనిమిది మందిలో ఇద్దరి మృతదేహాలు లభ్యంకాగా మిగిలిన ఆరుగురి మృతదేహాల కోసం కుటుంబాలు నిరంతరం ఎదురుచూసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఎంతో ఆశతో బాధిత కు టుంబసభ్యు లు తిండి నిద్రమాని ఎదురుచూసినా చివరికి ప్రభుత్వం మృతదేహాలు వెలికితీయలేక చేతులెత్తేసింది. డేంజర్‌జోన్‌లో మృతదేహాలు వెలికితీసేందుకు ఎలాంటి చర్యలు చేపడుతుందో చూడాలి.
మొ దటిలో ప్రభుత్వం, మంత్రులు హెలికాప్టర్లో వచ్చి హడావుడి చేశారు. కొన్ని రోజుల తర్వాత అధికారుల కు అప్పగించేశారు. అధికారులు, సహాయక సిబ్బంది అక్కడే ఉండి 24గంటల పాటు శ్రమించి అన్వేషణ పూర్తి చేశారు. మిగిలిన ఆరుగురి మృతదేహాలు లభించకపోవడంతో రెస్యూ ఆపరేషన్ సిబ్బంది కూడా నిరాశలో ఉన్నారు. డేంజర్‌జోన్‌లో ప్రమాదకర పరిస్థితి లేకపోతే ఖచ్చితంగా శ్రమించి మృతదేహాలు బ యటకు తెచ్చేవారమని రెస్యూ సిబ్బంది కొందరు పే ర్కొన్నారు. డేంజర్‌జోన్‌లోకి వెళ్లడం అతికష్టంగా మా రడంతో వెళ్లలేకపోతున్నామని, వెళ్లేందుకు చాలా ప్ర యత్నాలు చేసినా పైనుంచి కూలిపడే ప్రమాదం ఉంద ని తెలిపారు. ఆరుగురి మృతుల కుటుంబసభ్యులను పిలిచి కుటుంబానికి రూ. 25లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇచ్చి పంపించనున్నట్లు సమాచారం.