కేసీఆర్ సర్కారు హయాంలో జూరాలకు వరద వచ్చిందంటే ఉంద్యాల స్టేజ్-1 పంప్‌హౌజ్ నుంచి తీలేరు పంప్హాజ్కు నీటిని విడుదల చేసేవారు. గతేడాది ఇదే సమయంలో కోయిల్‌సాగర్‌కు కృష్ణమ్మ గలగలా పారింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం జూరాలకు భారీ వరద వస్తున్నా..
గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసినా.. కరెంట్ సమస్య సాకుగా చూపుతూ అటు ఉంద్యాల వద్ద, ఇటు తీలేరు వద్ద ఉన్న మోటర్ల ద్వారా కోయిల్‌సాగర్‌కు నీటి పంపింగ్‌ను నిలిపేసింది. దీంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి పంపింగ్ ప్రారంభించాలని కోరుతున్నారు. – మరికల్, జూలై 28