ప్రతి ఎకరాలో సంపదను సృష్టిస్తాం
ప్రతి ఎకరాలో, గుంటలో పైరుల సంపదను సృష్టించి.. రై తుల సంక్షేమాన్ని కండ్లారా చూడడమే సర్కారు లక్ష్యమని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తెలిపారు.
- ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి
- ర్యాలంపాడు రిజర్వాయర్, కోయిల్‌సాగర్ కాల్వలకు సాగునీటి విడుదల
ధరూరు, ఆగస్టు 1 : ప్రతి ఎకరాలో, గుంటలో పైరుల సంపదను సృష్టించి.. రై తుల సంక్షేమాన్ని కండ్లారా చూడడమే సర్కారు లక్ష్యమని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తెలిపారు. మండలంలోని నెట్టెంపాడు ఎత్తిపోతల పరిధిలోని ర్యా లంపాడు రిజర్వాయర్ ద్వారా కుడి, ఎడమ కాల్వలకు మంగళవారం సాగునీటిని విడుదల చేశారు. కృష్ణాజలాలకు ఎమ్మెల్యే హారతులు ఇచ్చారు. అంతకుముందు వై స్ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నడిగడ్డ చుట్టూ నీరు పారుతున్నా.. గత పాలకుల నిర్లక్ష్యంతో సాగు, తాగునీటికి నోచుకోలేదన్నారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అతి తక్కువ కాలంలో అద్భుతమైన ప్రగతి సాధించామని, నడిగడ్డను సస్యశ్యామలం చేశామన్నారు. గత పాలకుల కమీషన్ రాజకీయాలతో నాలుగు టీఎంసీల రిజర్వాయర్‌ను రెండు టీఎంసీలకే పరిమితం చేశారన్నారు. త్వరలోనే సాంకేతికపరమైన మరమ్మతులు చేయించి నీటి నిల్వ స్థాయిని పెంచుతామన్నారు. రైతులు సగర్వంగా బతుకుతుంటే రేవంత్‌రెడ్డి మూడు గంటల కరెంట్ చాలనడం విడ్డూరంగా ఉందన్నారు. రైతులను నట్టేట ముంచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర రాజకీయాలకు తెరలేపుతున్నదని మండిపడ్డారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీధర్‌గౌడ్, కేటీదొడ్డి జెడ్పీటీసీ రాజశేఖర్, సర్పంచ్ కర్రెమ్మ, మహబూబ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు ఈశ్వరయ్య, నాయకులు వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సర్వారెడ్డి, శ్రీరాములు, భీమ్‌రెడ్డి, పురుషోత్తంరెడ్డి, భరత్, అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

