మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 26 : జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో అక్టోబర్ 22వ తేదీన అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను కలెక్టరేట్లో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహబూబ్‌నగర్‌లాంటి పట్టణ ప్రాంతాల్లో మొదటిసారిగా అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలను ఆహ్వానించి ఉచితంగా ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన ఫెయిర్‌ను ఏర్పాట చేయడం గొప్ప విషయమన్నారు. అడిగిన వెంటనే ఇంటర్నేషనల ఎడ్యుకేషన్ హబ్ నిర్వాహకులు ఇక్కడ 20కుపైగా అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో ఎడ్యుకేషన్ ఫెయిర్‌ను నిర్వహిస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఫెయిర్ ద్వారా మహబూబ్‌నగర్ జిల్లా నుంచి విదేశాలకు వెళ్లి చదువుకునేంపదకు చక్కని అవకాశం లభిస్తుందన్నారు. ఈ ఫెయిర్‌కు దరఖాస్తు చేసుకునేందుకు https;bit.ly/IEFMBNR లింక్‌ను ఉపయోగించాలని తెలిపారు. జిల్లా విద్యార్థులు దసరా సెలవుల్లో ఏర్పాటు చేస్తున్న సదస్సును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ఎడ్యూకేషన్ హబ్(పవర్డ్ బై వన్ విండో) బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్లు వినయ్‌కుమార్, అంకిత్‌జైన్ తదితరులు ఉన్నారు.
21మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని అల్లీపూర్, బొక్కలోనిపల్లి, ధర్మాపూర్, ఫత్తేపూర్, కోడూరు, వెంకటాపూర్, ఓబులాయపల్లి, మాచన్పల్లితండా, జైనల్లీపూర్‌కు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ నుంచి మంజూరైన చెక్కుల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ రూరల్ తాసీల్దార్ కార్యాలయం వద్ద పంపిణీ చేశారు. 21మంది రూ.21,02,436 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్ ఎంపీపీ సుధాశ్రీ, జెడ్పీటీసీ వెంకటేశ్వరమ్మ, ముడా డైరెక్టర్ ఆంజనేయులు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఐలమ్మ పోరాటం.. స్ఫూర్తి
సబండవర్గాల సంక్షేమం కోసం పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ అని ఎక్సైజ్ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలోని పద్మావతీకాలనీ గ్రీన్‌బెల్ట్‌లో ఏర్పాటు చేసిన ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. అనంతరం రజక సంఘం భవనానికి పాతపాలమూర్లో ఎకరా స్థలాన్ని కేటాయిస్తూ త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో ఎస్పీ నర్సింహ, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ముడా చైర్మన్ వెంకన్న, రైతుబంధు అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం, గొర్రె కాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు శాంతన్నయాదవ్, మేదర సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.