అయిజ, జనవరి 19 : భారత్ మాల రోడ్డు టి ప్పర్ కింద పడి మృతిచెందిన దావీద్ కుటుంబానికి పరిహారం చెల్లించాలని బంధువులు, గ్రామస్తులు పట్టణంలోని పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఆం దోళనకు దిగారు. శనివారం రాత్రి అయిజ మండలంలోని వెంకటాపూర్ స్టేజీలో యాపదిన్నె గ్రా మానికి చెందిన దావీద్ మరో ఇద్దరితో కలిసి గ్రా మానికి వెళ్తుండగా రోడ్డుకు మట్టిని తరలిస్తున్న భారత్ మాల రోడ్డు టిప్పర్ ఢీకొట్టగా దావీద్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు గాయాలై కర్నూల్ ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయమై వెంకటాపూర్ స్టేజీలోనే మృతదేహంతో శనివారం రాత్రి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు మృతదేహాంతో రో డ్డుపై ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకు న్న శాంతినగర్ సీఐ టాటాబాబు, ఎస్సై విజయ్ భాస్కర్ ఘటనా స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులకు నచ్చచెప్పి మృతదేహాన్ని గద్వాల ప్ర భుత్వ దవాఖానకు తరలించారు.
మృతుడి భా ర్య జయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చే సుకున్న పోలీసులు, డ్రైవర్ అరెస్టు చేయకపోవ డం, పరిహారం విషయంలో భారత్ మాల రోడ్డు కాంట్రాక్టర్ ముందుకు రాకపోవడంతో ఆదివా రం అయిజ పట్టణంలోని పోలీస్ స్టేషన్‌కు మృతు డి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు చేరుకొని ఆందోళనకు చేపట్టారు. సీఐ, ఎస్సైలు గ్రామస్తులకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా ఆందోళన విరమించలేదు. దీంతో పోలీస్ స్టేషన్ లో ఉద్రిక్తతకు దారి తీసింది. ఒక దశలో డ్రైవర్‌ను అరెస్టు చేసే వరకు పోలీస్ స్టేషన్ విడిచివెళ్లమని పోలీసులకు తెగేసి చెప్పారు. డ్రైవర్‌ను అరెస్టు చే యడంతోపాటు సోమవారం పరిహారం విషయ మై కాంట్రాక్టర్‌తో చర్చించి, న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని సీఐ టాటాబాబు చెప్పడంతో ఆందోళనను గ్రామస్తులు విరమించారు. బాధితుడికి న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామని పోలీసులకు గ్రామస్తులు తెలిపారు.