నల్లమలలోని గుట్టలు తరిగిపోతున్నాయి. అటవీ ప్రాంతం చినబోతోంది. పెద్దపులుల గాండ్రింపు అధికార దాహంతో నిండిన నాయకుల స్వార్థంతో మూగబోతున్నది. మయూరాల నాట్యంతో పర్యాటకులను అలరిస్తున్న నెమలి గూడు చెదిరిపోతోంది. ఖనిజ సంపద దారితప్పడమే కాకుండా ఆయుర్వేద వనమూలికలతో వందలాది సంవత్సరాల వయస్సు ఉన్న భారీ వృక్షాలు సైతం నేలకొరుగుతున్నాయి.
నల్లమల అభయారణ్యం లో ప్రశాంతంగా ఉన్న సకల జీవరాశి భయం గుప్పిట్లో గూడు చెదిరి చెల్లాచెదురవుతున్నాయి. కొల్లాపూర్ సమీపంలోని నల్లమల గట్టు క నుమరుగవుతోంది. వేలాది ట్రిప్పుల ఎర్రమట్టి అక్రమంగా తరలిపోతుం ది. కొందరు అక్రమార్కులు గట్టును మాయం చేస్తున్నా.. అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
– మహబూబ్నగర్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో అధికార ప్రోద్భలంతో అక్రమార్కులు నల్లమలలోని ఓ గట్టును మా యం చేస్తున్నారు. సహజసిద్ధ అందాలకు నిలయంగా కొ ల్లాపూర్ నల్లమల గట్టుకు కొందరు బోడిగుండు కొట్టి అంధవికారంగా చేస్తున్నారు. పర్యావరణంతోపాటు వేలాది చె ట్లను నరికి వేస్తున్నారు. ఎర్రమట్టి కోసం జరుగుతున్న ఈ తతంగం అధికారుల కండ్లముందు జరుగుతున్నా ప్రజాపత్రినిధుల అండదండలు ఉండడంతో ముడుపులు తీసుకొ ని పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కొల్లాపూర్ నుంచి పర్యాటక ప్రదేశాలైన సోమశిల, కృష్ణానది తీరానికి వెళ్లే ప్రధాన రహదారికి రెండు వైపులా ఉన్న గట్టును పట్టపగలే కొల్లగొడుతున్నా.. ఏ అధికారి అ టు వైపు కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలున్నాయి. కొ ల్లాపూర్లో మట్టి మాఫియా చేసే అరాచకం ఇందుకు అద్దం పడుతోంది. హైవే కోసం సర్వే నెంబర్ 69, 70, 71లలో నాలుగున్నర ఎకరాల్లో 20 వేల క్యూబిక్ మీటర్ల మట్టి తీ సేందుకు రూ.10 లక్షలు చలానా, గట్టుపై ఉన్న విలువైన చెట్లను వంట చెరుకుగా చూపి రూ.10 వేల చలానా కట్టా రు. అయితే అక్టోబర్ రెండో వారంలో గట్టును తవ్వడం ప్రారంభించి ఇప్పటివరకు కేవలం వెయ్యి టిప్పర్లు మాత్ర మే మట్టి తీసినట్లు గుత్తేదారులు చెప్పుతున్నారు.
కానీ.. ఇప్పటికే దాదాపు పరిమితికి మించి 30 క్యూబిక్ మీటర్లలో మట్టి తరలించినట్లు తెలుస్తోంది. ఇదే అదునుగా హైవే పే రిట మట్టిని తరలిస్తూ అధికార పార్టీ నేతలు కొందరు వారి పొలాలకు రోడ్లు వేసుకుంటున్నారని సమాచారం. ఫారెస్ట్, రెవెన్యూ వివాదంలో ఉన్న ఏరియాలో బహిరంగంగా గ ట్టును తవ్వుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. గట్టును నాశనం చేయకుండా పూర్వపు పట్టాలు ఉండి పంటలు పం డించుకుంటున్న తమపై జులుం ప్రదర్శించే అధికారుల కం డ్ల ముందు.. వేలాది చెట్లను నరికేస్తున్నా చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సామాన్యులకో న్యాయం..? రాజకీయ నాయకులకు మరో న్యాయమా..? అంటూ నిలదీశారు. వేలాది టిప్పర్లతో మట్టి తవ్వుతున్నా పట్టించుకోని సంబంధిత మైనింగ్ అధికారుల పాత్రపై కూ డా అనుమానం ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులు, అధికార పార్టీ నాయకులు కలవడంతోనే నల్లమల గట్టు నల్లబుచ్చుకుంటుందని పర్యావరణ ప్రేమికులు పేర్కొంటున్నారు. తక్షణమే తవ్వకాలను నిలిపివేసి చెట్ల నరికివేత, ఎన్ని క్యూ బిక్ మీటర్ల మట్టి తీశారో వంటి అంశాలతోపాటు అధికార దుర్వినియోగంతో గట్టు మట్టితో రోడ్లు వేసుకున్న వారిపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ప్రజా సం ఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
తవ్వకాలపై వివరణ కోసం ‘నమస్తే తెలంగాణ’ ప్రయత్నించగా రెవెన్యూ అధికారులు అందుబాటులోకి రాలేదు. మైనింగ్ అధికారు లు మాట్లాడేందుకు కూడా భయపడుతున్నారు. విశ్వనీయ సమాచారం ప్రకారం గట్టుపై లక్షలాది చెట్లు ఉంటే కేవలం 15 చెట్లకు రూ.ఐదు వేలు చలానా కట్టినట్లు తెలుస్తోంది.
కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. తవ్వకాలు జరుగుతున్న ప్రదేశం మా పరిధిలో లేదని, చెట్ల నరికివేతపై కేసు నమోదు చేశామని, అంతకు మించి త మకేమీ తెలియదని చెప్పారు.