వనపర్తి, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వనపర్తి జిల్లాలోని చాలా గ్రామాల్లో రెబ ల్స్ అభ్యర్థులతో తంటాలు తప్పడం లేదు. ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీకి రెబల్స్ తలనొప్పి అధికంగా కనిపి స్తున్నది. ఇతర పార్టీల్లోనూ అక్కడక్కడ కొంత ఉన్నప్పటికీ అంతగా ప్రభావం లేదు. ఒక్క వనపర్తి నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికలను పరిశీలిస్తే.. దాదాపు అన్ని మండ లాల్లో అధికార కాంగ్రెస్ నుంచి రెబల్స్ సమస్య ఉన్నట్లు సమాచారం. కొన్ని చోట్ల విరమించుకున్నా.. మరికొన్ని చోట్ల బరిలో నిలిచారు. ఎమ్మెల్యే, చిన్నారెడ్డి వర్గాలుగా గ్రామాల్లో పోటీలు వేర్వేరుగా జరుగుతున్నాయన్న గుసగుసలు ఉన్నా యి. ఆ స్థానాల్లో ప్రచారాలకు వెళ్లాలన్నా కూడా తలనొప్పిగా మారింది. అసెంబ్లీ ఎన్నికల నుంచి రెండు వర్గాలుగా కాంగ్రెస్లో ఉండగా, ఇప్పుడు కొత్తగా డీసీసీ అధ్యక్షుడి ప్రక టన సైతం కాంగ్రెస్లో మరో కొత్త తలనొప్పిని తెచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది.
గ్రామ పంచాయతీ ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీకి తల నొప్పిగా మారాయి. ఇంతకాలం అధికారిక కార్యక్రమాల్లో ఏకఛత్రాధిపత్యంగా ముందుకు వెళ్లిన ఎమ్మెల్యేకు సర్పంచ్ ఎలక్షన్లు ఓ అగ్నిపరీక్షగా మారినట్లు చర్చ జోరందుకున్నది. దీనికి అదనంగా ఇటీవల ప్రకటించిన డీసీసీ అధ్యక్ష పదవి సైతం రెడ్డి సామాజిక వర్గానికి కట్టబెట్టడంతో బీసీ సంఘాలు గుస్సాతో ఉన్నారు. వీరంతా సమయం కోసం ఎదురు చూస్తు న్నట్లుగా కనిపిస్తున్నది. నేటి తో తొలి విడుత ప్రచా రాలు ముగుస్తున్నా.. ఎమ్మెల్యేగా మేఘారెడ్డి వనపర్తికి ప్రాతినిధ్యం వహిస్తుండగా.. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా చిన్నారెడ్డి కొనసా గుతున్నారు.
అయితే కనీసం డీసీసీ అధ్యక్ష పదవైనా బీసీలకు కేటాయిస్తారని ఊహించినా ఆశలు నిరాశే అయ్యాయి. అసలు దరఖాస్తు కూడా పెట్టుకోని శివసేనారెడ్డికి కేటా యించడాన్ని బీసీ సంఘాలు జీర్ణించు కోలేక పోతు న్నాయి. 21 మంది (అధిక ంగా బీసీ నాయకులు ఉన్నారు) దరఖా స్తులు చేసుకోగా, ఎవరి అంచనా లకు అందకుండా జరిగిన ప్రకట నతో కాంగ్రెస్ నిర్ణయంపై బాహాటంగానే విమర్శలు వినిపించాయి. బీసీ సం ఘాలు అంతర్గతంగా తీవ్రంగా వ్యతి రేకిస్తున్నట్లు సమా చారం. ఈ క్రమంలో బీసీ సంఘాల ప్రభావం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై చూపుతాయని భావిస్తున్నారు.
తొలి విడుత సర్పంచ్ ఎన్నికల ప్రచారం మంగళవారంతో ముగియనున్నది. నామినేషన్లు, ఉపసంహరణలు పూర్తి చేసుకున్న అభ్యర్థులు ప్రచారాలకు పదును పెట్టారు. తమకున్న బలాలు, బలహీనతలను అంచనా వేసుకుని సర్పంచ్ ఎన్నికల్లో ఎలాగైన గెలుపొందాలన్న లక్ష్యంతో పావులు కదుపుతు న్నారు. పంచాయతీల పోరులో పల్లెలన్నీ హోరెత్తుతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా వారీగా చూస్తే.. తొలి విడుతలో 550 గ్రామ పంచాయ తీలకు, 4,840 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో ఏకగ్రీవమైన సర్పంచ్ స్థానాలు 58 పక్కన పెడితే.. మిగిలిన 2,172 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. అలాగే వార్డుల వారీ గా చూస్తే.. 1,071 వా ర్డులు ఏక గ్రీవం కాగా.. మిగిలిన వార్డులకు 9,551 మంది అభ్య ర్థులు పోటీ చేస్తున్నారు.
వనపర్తి జిల్లాలో అధికార పార్టీ నుం చి ముగ్గురు ముఖ్య నేతలు ఇక్కడ ప్రాతినిథ్యం వహిస్తున్నా.. ప్రచారాల్లో కనిపించక పోవడం చర్చ నీయాంశమైంది. లోకల్ బాడీ ఎలక్షన్లకు వీరిద్దరూ దూరంగా ఉండటం చర్చనీయా ంశ మైంది. రెండేళ్లుగా వనపర్తి నియోజ కవర్గంలో అధికారిక కార్యక్రమాలను నిర్వహించడం అధికారులకు తలనొప్పిగా మారిన సందర్భాలు అనేకం తారసపడ్డాయి. అప్పట్లో ఎమ్మెల్యే మేఘారెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మధ్య పలు అధికారిక కార్యక్రమాల్లో సమస్యలు బహిరంగానే ఉత్పన్నమయ్యాయి. ఇక ఇటీవల డీసీసీ అధ్యక్షుడిగా శివసేనారెడ్డిని పీసీసీ ప్రకటించిన సంగతి విదితమే. కేవలం ఒకరోజు మీడియా సమావేశం నిర్వహించడంతోనే మమ అనిపించారు. ఇక పంచాయతీ పోరు మొదటి దశ ముగుస్తున్నా ఎమ్మెల్యే మినహా ఆ ఇద్దరు నేతలు ప్రచారాల్లో కనిపించక పోవడం అధికారపార్టీని కలవ రానికి గురి చేస్తున్నది.
కల్వకుర్తి రూరల్, డిసెంబర్ 8 : పట్టణంలోని కేశవనగర్లో భారీ దొంగతనం జరిగింది. కల్వకుర్తి ఎస్సై మాధవరెడ్డి కథనం మేరకు.. ఊర్కొండ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజారిగా ఉన్న శ్రీనివాసశర్మ కల్వకుర్తి పట్టణంలోని కేశవనగర్లో నివాసం ఉంటున్నాడు. శర్మ భార్య పుట్టింటికి వెళ్లగా.. వారం రోజులుగా ఇంటికి తా ళం వేసి ఉంటుంది. గమనించిన గుర్తు తె లియని వ్యక్తులు తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. బెడ్రూంలో బీరువాను ధ్వంసం చేసి అం దులోని 40 తులాల బంగారు ఆభరణాలు, రూ. 6 లక్షల నగదును దోచుకెళ్లారు.
సోమవారం ఉద యం కల్వకుర్తికి చేరుకున్న శ్రీనివాసశర్మ భార్య ఇంటికి వచ్చి చూసే సరికి తాళం విరగ్గొట్టి ఉండడంతో అనుమానంతో భర్తకు సమాచారం ఇచ్చిం ది. వెంటనే అక్కడకు చేరుకోగా బీరువా.. బట్టలు, వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండగా.. పోలీసులకు సమాచారం అందించాడు. ఎస్సై మాధవరెడ్డి, పట్టణ-2 ఎస్సై రాజశేఖర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై తెలిపారు.
