గట్టు, సెప్టెంబర్ 9 : ఉన్న ఊరు వదిలి, చెట్టుకొకరు పు ట్టకొకరు అన్నట్లుగా చిన్నోనిపల్లి వాసులు ఊరు ఖాళీ చేసిన తర్వాత ప్రజాప్రతినిధులు, అధికారులకు ఇప్పుడు తెల్లారి నట్లు ఉన్నది. ఆదివారం రిజర్వాయర్‌తోపాటు చిన్నోనిపల్లి ముంపు గ్రామాన్ని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సం దర్శించిన సంగతి తెలిసిందే. అయితే ఈ గ్రామస్తులు పడు తున్న కష్టాలపై నిత్యం మీడియాలో కథనాలు వస్తుండడం తో ఎమ్మెల్యే, తాసీల్దార్ లేఖలతో కలెక్టర్ బీఎం సంతోష్ స్పందించారు. అధికారులను నాలుగు టీంలుగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
గట్టు, ధరూర్, మల్దకల్, కలెక్టరేట్ ‘ఎఫ్’ సెక్షన్ తాసీల్దార్లు వరుసగా సరితారాణి, వెం కట్రావు, జుబేర్ అహ్మద్, రాధాకృష్ణ ఆధ్వర్యంలో టీంల ను నియమించారు. ఒక్కో టీంలో ఎస్సైతోపాటు ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ముంపు గ్రామంతోపాటు పునరావాస కేంద్రాన్ని ఆర్డీవో రాంచందర్ ఆధ్వర్యంలో అధికారులు పరిశీలించి ముంపునకు గురైన ఇండ్ల లెక్కను తేల్చారు. పునరావాస కేంద్రంలో ఇదివరకు పంపిణీ చేసిన ప్లాట్లలో పొజిషన్ ఎవరున్నారనే విషయాన్ని గుర్తించారు.
విద్యుత్, మిషన్ భగీరథ తదితర శాఖల అధికారులు కూ డా గ్రామంలో మకాం వేసి పునరావాస కేంద్రానికి అవసరమయ్యే మౌలిక వసతులపై లెక్కలు వేశారు. కాగా గ్రామస్తులు, నిర్వాసితుల కోసం అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అయితే స్థానికులు ఆందోళన చేస్తారనే ముందుచూపుతో గట్టు, ధరూర్, మల్దకల్, అయిజ ఎస్సైలు కేటీ మల్లేశ్, అబ్దుల్ షుకూర్, సురేశ్, విజయ్ భాస్కర్ ఆధ్వర్యంలో పో లీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఊరును ఖా ళీ చేయించాలనే లక్ష్యంతోనే ప్రజాప్రతినిధులు, అధికారు లు అడుగులు వేస్తున్నారని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. ఇన్నాళ్లు పట్టించుకోకుండా ఇప్పుడే ఆగమేఘాల మీద అధికారులు రావడమేమిటని ప్రశ్నిస్తున్నారు. తమకు రావాల్సి న ప్రయోజనాలు ఇవ్వకుండా ఊరును ఖాళీ చేసే ప్రయత్నంలోనే వారు ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు.