Collector Vijayendra Boyi | రేషన్ షాపులలో డీలర్లు రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులకు సకాలంలో అందించాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి సూచించారు. ఇవాళ దేవరకద్ర మండల కేంద్రంలోని మూడవ రేషన్ షాప్‌ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రేషన్ డీలర్ మాధవరెడ్డితో మాట్లాడుతూ.. రేషన్ షాపు ప్రతిరోజు తెరచుకుని ఉండాలని సూచించారు. లబ్ధిదార్లకు ప్రభుత్వం నుంచి సరఫరా చెసే సన్నబియాన్ని పంపిణీ చేయాలని నిర్దేశించారు.
ఈ సందర్భంగా డీలర్ షాపులో కింద ఎలాంటి సంచులు లేకుండా రేషన్ బియ్యం కింద పారవేయడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కింద ఒక గోనెసంచి వేసి బియ్యం దానిపై వేసి తూకం చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా ప్రతీ రోజు రెవెన్యూ ఆర్ఐ షాపును తనిఖీ చేసి రేషన్ షాప్‌లో పరిశుభ్రత పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ రేషన్ షాపుల ద్వారా నిరుపేదలకు సన్నబియాన్ని పంపిణీ చేయడం జరుగుతుందని డీలర్లు ఎలాంటి అవకతవకలకు పాల్పకుండా లబ్ధిదార్లకు బియ్యాన్ని పంపిణీ చేయాలని సూచించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ లబ్ధిదార్లతో మాట్లాడుతూ.. గతంలో దొడ్డు బియ్యాన్ని ఏం చేసే వారిని అడిగి తెలుసుకున్నారు. దీంతో కొంతమంది లబ్ధిదారులు తింటున్నామని చెప్పగా.. మరి కొంతమంది లబ్ధిదారులు ఇతరులకు విక్రయిస్తున్నామన్నారు. ఇప్పుడు కూడా సన్నబియాన్ని ఇతరులకు విక్రయిస్తారా..? అని కలెక్టర్ అడగగా సన్న బియ్యం కాబట్టి వండుకుని తింటామని కలెక్టర్‌కు లబ్ధిదారులు సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ కృష్ణయ్య, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఆర్ఐ శరత్ నాయక్ తదితరులు ఉన్నారు.
Passengers | 40 గంటలుగా తుర్కియే ఎయిర్‌పోర్ట్‌లోనే.. వసతుల లేమితో భారతీయ ప్రయాణికుల అవస్థలు
Alampur | అలంపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గవ్వల శ్రీనివాసులు
Taj Mahal: టికెట్ సేల్స్ ద్వారా ఆదాయం.. టాప్‌లో తాజ్‌మహల్