గద్వాల అర్బన్, సెప్టెంబర్ 23 : పేదల కడుపునింపేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నవి. అ క్రమార్కులు గుట్టుచప్పుడు కాకుండా ఇతర రాష్ర్టాలకు తరలిస్తూ కోట్లు కుప్పేస్తున్నారు. పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న రేషన్ బి య్యం అక్రమార్కులకు వరంగా మారింది. జిల్లా లో ప్రతినెలా అక్రమ దందా జోరుగా సాగుతున్నా రు. కొంతమంది సిండికేట్‌గా మారి రైస్‌మిల్లులో రీసైక్లింగ్ చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఈ వ్యవహారంలో సంబంధిత శాఖ అధికారుల పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రైతుల ద్వారా కొనుగోలు చేసిన వడ్లను ప్రభు త్వం మిల్లర్లకు అందజేస్తోంది. రైస్ తయారైన త ర్వాత బియ్యాన్ని సివిల్ సప్లయ్ అధికారులు పర్యవేక్షించి రేషన్ షాపులకు సరఫరా చేస్తారు. అయితే రైతుల నుంచి సేకరించిన వడ్లను పలు దఫాలుగా అధికారుల లెక్కల ప్రకారం మిల్లర్లు రైస్‌ను అం దించాలి. ఇక్కడే రైస్ మిల్లర్లు తమ చేతివాటం ప్ర దర్శిస్తూ.. బియ్యాన్ని అక్రమంగా కర్ణాటకలోని బంగారుపేట్‌కు తరలిస్తున్నట్లు సమాచారం. అయి తే వీరి వ్యవహారానికి జిల్లా కేంద్రంలో అధికార పార్టీకి చెందిన ఓ రాజకీయ నాయకుడి అండదండలు పుష్కలంగా ఉండడంతో అక్రమార్కుల దం దా.. మూడుపువ్వులు..ఆరు కాయలుగా నడుస్తున్నది.
అలాగే ప్రభుత్వ శాఖలో విధులు నిర్వహిం చే కొందరి అధికారుల పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వీరికి నెలనెలా మామూళ్లు కూడా అందుతున్నట్లు సమాచారం. కిందిస్థాయి నుంచి పైస్థాయి అధికారి వరకు ర్యాంకును బట్టి లెక్క ఉంటుందని సమాచారం. అయితే, గద్వాల నుంచి కర్ణాటక రాష్ట్రంలోని బంగారుపేట్‌కు ఓ రేషన్ లా రీని అక్రమంగా తరలిస్తుండగా.. ఏపీలోని అనంతపురం జిల్లా పోలీసులు తనిఖీ చేసి పట్టుకున్నట్లు తెలిసింది.
లారీలో ఉన్న బియ్యానికి సరైన లెక్కలు లేకపోవడంతో పలు అనుమానాలకు దారి తీ సింది. లారీ ఎక్కడి నుంచి వచ్చిందో.. బియ్యం ఎ క్కడివి.. అనే కోణంలో ఏపీ పోలీసులు విచారణ చేపడుతున్నట్లు తెలిసింది. కొంతకాలంగా బంగారుపేట్ అడ్డాగా తెలంగాణలోని కొన్ని జిల్లాల రైస్ మిల్లర్లు అక్రమ దందా కొనసాగిస్తున్నట్లు ఏపీ పో లీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తే తక్షణమే చర్యలు తీసుకుంటాం. జిల్లా నుంచి ఇతర రాష్ర్టాలకు వెళ్లే గూడ్స్ వాహనాలను నిత్యం తనిఖీ చేస్తున్నాం.. తనిఖీలో అక్రమంగా రేషన్ తరలిస్తున్న వాహనాలను పట్టుకొని సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నాం. ఈ వ్యవహారంలో ఎవరున్నా.. ఉపేక్షించేది లేదు. ప్రభుత్వ అధికారులున్నా.. పైవేట్ వ్యక్తులున్నా.. చర్యలు తీసుకుంటాం.
– సత్యనారాయణ, గద్వాల డీఎస్పీ