అచ్చంపేట టౌన్: ఉమామహేశ్వర దేవాలయ మాజీ చైర్మన్ కందూరి సుధాకర్‌కు (Kanduri Sudhakar) అరుదైన పురస్కారం లభించింది. ఆదివారం హైదరాబాదులోని రవీంద్ర భారతిలో నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నిర్వాహకులు ఉగాది, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా సుధాకర్‌కు భారత్ విభూషణ్ ( Bharat Vibhushan) అవార్డును అందించి సత్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమామహేశ్వర దేవాలయాన్ని (Umamaheshwara Temple) ప్రగతి పథంలో నిలిపినందుకు , వివిధ సామాజిక కార్యక్రమాల ద్వారా సేవలు అందించినందుకు పురస్కారాన్ని అందించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా అచ్చంపేట పట్టణంలోని వివిధ వర్గాల ప్రజలు, ఆర్యవైశ్యులు, వివిధ పార్టీల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.