భూత్పూర్ : మనిషికి భగవంతునిపై నమ్మకం ఉంది అనడానికి రంజాన్ (Ramzan) పర్వదినం నిదర్శనమని మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్ గౌడ్ ( Baswaraj Goud) అన్నారు. పవిత్ర రంజాన్ సందర్భంగా సోమవారం పట్టణ పరిధిలోని ఈద్గా వద్ద ముస్లిం మత పెద్దలను, ముస్లిం సోదరులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత దేశంలో అన్ని మతాలకు సమాన ప్రాధాన్యత ఉందని తెలిపారు.
ముస్లిములు నెల రోజులపాటు ఉపవాస దీక్షలను దిగ్విజయంగా పూర్తి చేసుకొని పండుగను జరుపుకోవడం సంతోషదాయకమని అన్నారు. పండుగ రోజున పేదలకు దాన ధర్మాలు చేయడం ప్రత్యేకతలని అన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సత్తూర్ నారాయణ గౌడ్, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నవీన్ గౌడ్ తదితరులు పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.