ఊట్కూర్ : శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ సీతారాముల కల్యాణ ఉత్సవ వేడుకలను ఆదివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంతో పాటు తిప్రాస్ పల్లి, బిజ్వారం, పులిమామిడి, పెద్ద జట్రం గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. సాయంత్రం బిజ్వార్ గ్రామంలో రాములోరి రథోత్సవాన్ని (Rathotsavam) నిర్వహించి మేళ తాళాలతో పుర వీధుల్లో ఊరేగించారు.
బంతిపూలతో ముస్తాబు చేసిన రథంలో సీతారాముల విగ్రహాలను ప్రతిష్టించారు. భక్తులు పోటీపడి రథాన్ని ముందుకు లాగారు. అంతకుముందు హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముని కల్యాణ మహోత్సవం, పట్టాభిషేకం, పూజ కార్యక్రమాలను స్థానిక రామాలయంలో అర్చకులు నరసింహచారి జోషి, రవికుమార్ జోషి, నాగరాజ్ చారి జోషి, వేణుగోపాలచారి జోషిల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఆలయ కమిటీ సభ్యులు, దాతలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు, పానకం పంపిణీ, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో నిర్వాహకులు సుధాకర్ రెడ్డి, రాఘవేందర్, అశోక్ రెడ్డి, ఆంజనేయులు గౌడ్, దొరోల్ల కృష్ణయ్య, మహేష్ గౌడ్, మాజీ సర్పంచ్ శివలింగమ్మ అరుణ, లక్ష్మి, భూపాల్ రెడ్డి, హెచ్ నరసింహ పోలీస్ హన్మి రెడ్డి పాల్గొన్నారు.