అచ్చంపేటరూరల్: మండలంలోని ఐనోల్ గ్రామంలో కామ్రేడ్ బూసి రామచంద్రారెడ్డి ( Ram Chandra Reddy ) 16వ వర్ధంతిని గ్రామంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఎం జిల్లా కార్యదర్శి ( CPM Secretary ) వర్గ సభ్యులు దేశ్యానాయక్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు . ఆయన మాట్లాడుతూ పేదలు, కూలీలను కూడగట్టి ఎర్రజెండాకు వన్నెతెచ్చిన గొప్ప నాయకుడని పేర్కొన్నారు. పేదలు, కష్టజీవుల కోసం నిరంతరం ఎర్ర జెండా నీడలో పనిచేసిన ఉద్యమ నాయకుడని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో రామచంద్రారెడ్డి కుమారులు భూపాల్ రెడ్డి ,మణిపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు, సీపీఎం మండల కార్యదర్శి వర్ధన్ సైదులు, సీనియర్ నాయకులు బి రాములు , శివకుమార్, మహిళా సంఘం నాయకురాలు. నిర్మల, సైదమ్మ, మాజీ సర్పంచి లింగారెడ్డి ,వెంకటయ్య, చంద్రయ్య, బాలయ్య, అంతయ్య, చిన్న అంజయ్య, వీరయ్య,తదితరులు పాల్గొన్నారు.