కొల్లాపూర్ ఏప్రిల్ 24 : ఈనెల 27న వరంగల్లో జరిగే బీర్ఎస్ పార్టీ రజతోత్సవ సకు కొల్లాపూర్ నియోజక వర్గం నుంచి వేలాదిగా తరలి వెళ్దామని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దూరెడ్డి రఘువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం కోడేరు మండలానికి చెందిన బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో జన సమీకరణపై సమీకరణపై చర్చించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ కాంగ్రెస్ పాలనలో ఆగమైందన్నారు. సభకు ప్రతి పల్లె నుంచి పార్టీ కార్యకర్తలు వందలాదిగా తరలి వచ్చే విధంగా ప్రణాళికలను రచించుకోవాలన్నారు. భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీ దేనని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ చేస్తున్న తప్పులే కాంగ్రెస్ పార్టీ పతనానికి మెట్లుగా మారాయన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ హామీని కూడా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా అమలు చేయలేదని ఆయన విమర్శించారు. ముఖ్యంగా కొల్లాపూర్ నియోజక వర్గంలో అకాల ప్రకృతి వైపరీత్యంతో మామిడి రైతులకు తీవ్ర నష్టం జరిగితే అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు మామిడి తోటల వైపు కన్నెత్తి కూడా చూడలేదని విమర్శించారు. ఎండలు బాగా ముదిరిన నేపథ్యంలో సభలకు తరలి వెళ్లే వాహనాలలో మంచినీటి సౌకర్యం ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.