Nagarkurnool | వెల్దండ, జూన్ 1 : నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం రాచూరు గ్రామానికి చెందిన పలువురు చిన్నారులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్లో ఆదివారం నిర్వహించిన అథ్లెటిక్స్ పోటీలకు అథ్లెటిక్స్ అసోసియేషన్ సబ్ జూనియర్ 11వ క్రీడలకు ఎంపికై ఆదివారం వెళ్లారు. వారికి అంతర్జాతీయ క్రీడాకారిణి లావణ్య రెడ్డి క్రీడల్లో మంచి భవిష్యత్తు ఉందని అన్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి రాష్ట్ర స్థాయికి రావడం చాలా గొప్పదని అన్నారు. క్రీడాకారులకు స్పోర్ట్స్ డ్రెస్ అందించి వారందరినీ అభినందించారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులు అందరూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభ చాటాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు విజయేందర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ స్థూలపోగుల స్వాములు , గోకమళ్ళ రాజు క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.