జడ్చర్లటౌన్, జూలై 8 : జడ్చర్ల మున్సిపాలిటీలోని బాదేపల్లి పెద్దగుట్టపై ఉన్న రంగనాయకస్వామి ఆలయం ఎదుట ఉన్న కోనేరు పూడ్చివేతను నిరసి స్తూ సోమవారం చేపట్టిన ‘జడ్చర్ల బంద్’ ప్రశాంతం గా ముగిసింది. ధార్మిక సంఘాలు, ఆలయ పరిరక్షణ కమిటీ పిలుపుమేరకు పట్టణంలోని వ్యాపార సముదాయాలు, విద్యాసంస్థలను స్వచ్ఛందంగా బంద్ చే శారు. బాదేపల్లి పాతబజార్ ఆంజనేయస్వామి ఆల యం నుంచి పట్టణ ప్రధాన రహదారులపై ధార్మిక సంఘాలు, ఆలయ పరిరక్షణ కమిటీ సభ్యులు, యు వకులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కోనేరు పూడ్చివేతకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. అనంతరం నేతాజీ కూడలిలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దుండగులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపి అనుమానం రా కుండా కోనేరు పూడ్చివేతకు పాల్పడ్డాడరని ఆరోపించారు. వెంటనే అదుపులోకి తీసుకొని కఠినంగా శి క్షించాలని డిమాండ్ చేశారు. అవాంఛనీయ ఘటన లు చోటు చేసుకోకుండా జడ్చర్ల సీఐ ఆదిరెడ్డి, ఎస్సై లు పోలీసులతో కలిసి బందోబస్తు నిర్వహించారు.
కోనేరు, కట్టడాలు ధ్వంసం చేయడం బాధాకరం : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
జడ్చర్ల, జూలై 8 : రంగనాయకస్వామి ఆలయ కోనేరు పూడ్చడం, ఇతర కట్టడాలను కూల్చివేయ డం బాధాకరమని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధి కోసం కేసీఆర్ హయాం లో రోడ్డుమార్గం, శంఖుచక్ర నామాలు వంటి పనులను చేశామన్నారు. అలాగే గుట్టపై అభివృద్ధి పను లు, పార్కు ఏర్పాటు చేసేందుకు నిధులను కూడా మంజూరు చేశామన్నారు. టెండర్ పిలిచి కాంట్రాక్టర్ కొంత పనులు కూడా చేశారన్నారు. ఎన్నికల నేపథ్యంలో పనుల్లో జాప్యం జరిగిందన్నారు. ఇంతలోనే ఇలాంటి ఘటన జరగడం బాధాకరమన్నారు. ప్రజలు, భక్తులు, పెద్దలు, యువకులు ఎవరూ ఆం దోళన చేయకూడదని కోరారు. ఆలయ గుండానికి పూర్వవైభవం, ఆలయ అభివృద్ధి కోసం మనమందరం కలిసి పాటుపడదామన్నారు.