మహబూబ్‌నగర్ విద్యావిభాగం, అక్టోబర్ 19 : పీయూ వైస్ చాన్స్‌లర్‌గా ప్రొఫెసర్ శ్రీనివాస్ శనివారం బాధ్యతలు చేపట్టారు. ఇన్చా ర్జి వీసీగా కొనసాగుతున్న సీనియర్ ఐఏఎస్ అ ధికారి, ప్రణాళికా సంఘం రాష్ట్ర ముఖ్య కార్యదర్శి అహ్మద్నదీంను హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశా రు. సోమవారం పాలమూరుకు రానున్నారు.
పట్నం నుంచే పాలన కొనసాగిస్తారా..?
గతంలో పనిచేసిన వీసీ ప్రొఫెసర్ లక్ష్మీకాంత్‌రాథోడ్ పీయూలోని గెస్ట్హాజ్లోనే ఉండి వి ద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది బాగోగులు చూసుకోవడంతోపాటు విద్యాభివృద్ధికి విశేష కృషి చేశారు. ఆయన హయాంలో పీయూకు రూ.వంద కోట్ల నిధులు రావడంతోపాటు రూసా, ఇతర ప్రాజెక్టుల ద్వారా భారీ స్థాయిలో నిధుల సమీకరణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు రాకపోయినా.. వేతనాలు, పరిపాలనపరమైన అంశాల్లో ఆర్థిక ఇబ్బందులు కలగకుం డా జాగ్రత్తలు చేపట్టారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన వీసీ కరీంనగర్ జిల్లా కావడం, ఇన్నాళ్లు హైదరాబాద్‌లోనే ఉండడంతో పాలమూరులో ఉంటారా..? పట్నం నుంచే పాలన కొనసాగిస్తారా..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఉన్నత విద్యకు పెద్దదిక్కుగా ఉన్న పీయూ వైస్‌చాన్స్‌లర్ సీటు కోసం 159 దరఖాస్తులు అందాయి. ఇందులో రిజిస్ట్రార్లు, వైస్ చాన్స్లర్లుగా పనిచేసిన అనుభవం గ ల వారు ఉన్నా.. హైదరాబాద్ జేఎన్టీయూలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాస్ వైపు రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మొగ్గు చూపారు. పీయూలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుతోపాటు సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోని కోస్గి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఇంజినీరింగ్ కాలేజీగా మారనున్నది. మహబూబ్‌నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ ఐటీఐలను ఏటీసీలుగా మార్పు చేస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యావేత్తలు పేర్కొంటున్నారు.