గద్వాల టౌన్, మే 25 : పేద మధ్య తరగతి ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించాల్సిన పెద్దాసుపత్రిని సమస్యలు వెం టాడుతున్నాయి. ఓ పక్క డాక్టర్ల కొర త.. మరో పక్క సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతున్నది. దీంతో కనీ స వైద్యం అందించలేని స్థితిలో జిల్లా దవాఖాన ఉన్నది. బతికున్నప్పుడే కాసింతైనా పట్టించుకోని డాక్టర్లు సచ్చినాకైనా పట్టించుకుంటారేమో అ నుకుంటే అది కూడా ని రాశనే మిగిల్చింది. కనీసం శవాలను కూ డా భద్ర పరచలేని దీనస్థితిలో జిల్లా దవాఖాన ఉం డడటం శోఛనీయం. వా రం రోజు ల కిందట దవాఖానలో చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం.
వైద్య సేవలపై సిబ్బంది నిర్లక్ష్య ధోరణి
జిల్లా దవాఖానలో వైద్యులు, సిబ్బంది వైద్య సేవల అందించడంలో నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించడం పరిపాటిగా మారింది. ఇందుకు మార్చురీ ఘటనే నిదర్శనమనే చెప్పాలి. రోగుల పట్ల వైద్యులు వ్యవహరించిన తీరుపై దవాఖాన పర్యటనలో భాగంగా కలెక్టర్ రిజ్వాన్బాషా వైద్యులు, సిబ్బందిని హెచ్చరించినా మార్పు రావడం లేదు. వారు చెప్పేది చెప్తారు.. మేము చేసేది చేస్తామన్నట్లుగా సిబ్బంది వ్యవహరిస్తున్నారు. కనీసం సమయ పాలన కూడా పాటించకుండా ఇష్టానుసారంగా విధులకు హాజరవుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. జిల్లా దవాఖానను మెడికల్ కళాశాలకు అనుసంధానంగా చేసినా ప్రజలు ఆశినంత సేవలు అందడం లేదు. చిన్న ప్రమాదానికి గు రైనా.. రోగి వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న కర్నూ లు, హైదరాబాద్కు పంపి చేతులు దులుపుకోవడం వైద్యులు హమ్మయ్య భారం తీరిందని సెద తీరుతున్నారే తప్పా.. రోగికి ధైర్యం చెప్పి కాపాడాలన్న తపన ఉండడం లేదన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి.
వేధిస్తున్న సిబ్బంది కొరత
జిల్లా దవాఖానలో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తున్నది. ముఖ్యంగా మార్చురీలో నిర్ణీత మేర సి బ్బంది లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. మార్చురీకి నులుగురు సిబ్బంది, ప్రొఫెసర్, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు ఉండాలి. కానీ ఇ క్కడ ఏ ఒక్కరూ లేక పోవడం గమనార్హం. అలా గే మృతదేహాలకు వాడే కాటన్, క్లాత్, పనిము ట్లు సైతం లేకపోవడం వి డ్డూరమనే చెప్పాలి. సమస్యలు ఉన్నాయని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిని పట్టించుకోవడం లేదని సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పట్టించుకోని పాలకులు, ఉన్నతాధికారులు
ప్రజలు మెరుగైన వైద్య సేవలు అందించాలి, విధులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు అని పదే పదే చెప్పే పాలకులు, ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయిలో మాత్రం పర్యవేక్షణ చేయడం లేదు. నామమాత్రంగా తనిఖీలు చేయడం, రికార్డుల ను, వార్డులను పరిశీలించడం వెళ్లిపోవడం తప్పా దవాఖానలో ఉన్న సమస్యలపై ఆరా తీసి పరిష్కరించడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు, ఉన్నతాధికారులు స్పందించి మెరుగైన సేవలు అందించే దిశగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మూతపడిన మార్చురీ
జిల్లా దవాఖానలోని పోస్టుమార్టం విభాగ నిర్వహణ అత్యంత అధ్వానంగా మారింది. శవాలను కూడా భద్ర పరచలేని స్థితిలోకి వెళ్లింది. శవాలను భద్రపరిచేందుకు ఉన్న ఆరు ఫ్రీజర్లు మరమ్మతులకు నోచుకోక మూలన పడ్డాయి. మరమ్మతులకు గురై నెలలు గడుస్తున్నా దవాఖాన వర్గాలు పట్టించుకోవడం లేదు. అలాగే పోస్టుమార్టం నిమిత్తం వచ్చిన బాధితులపై సిబ్బంది దురుసుగా వ్యవహరిస్తున్నట్లు బాధితులు బాహటంగానే ఆరోపిస్తున్నారు. గతంలో మార్చురీలో ఓ మహిళ మృతదేహంపై ఉన్న నగలను సిబ్బంది దొంగిలించారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించడం కలకలం రేపింది. తాజాగా వారం రోజుల కిందట ఓ అనాథ శవాన్ని రూరల్ ఎస్సై శ్రీకాంత్ పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తీసుకొవచ్చారు.
ఉన్నతాధికారుల అనుమతి లేకుండా మార్చురీలో ఉంచడం కుదరదని సిబ్బంది చెప్పారు. శవాన్ని ఉంచడానికి కూడా ఫ్రీజర్లు పనిచేయడం లేదని, మార్చురీ తాళాలు తీసేది లేదని మీరే ఎక్కడైనా శవాన్ని భద్రపరచుకోండంటూ నిర్లక్ష్యంగా సమాధానాన్ని అక్కడున్న సిబ్బంది ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఎస్సై శవాన్ని మార్చురీ వద్దే వదిలేసి వెళ్లిపోయిన ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జరిగిన తప్పును సరిదిద్దుకునేందుకు దవాఖాన వర్గాలు నానా తంటాలు పడుతున్నాయి. పోలీసులకే ఇలాంటి పరిస్థితుల ఎదురైతే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.