కొల్లాపూర్, జూలై 22 : పాలమూరు-రంగారెడ్డి లిప్ట్ -1లో రెండో పంప్ వెట్ రన్ సక్సెస్ అయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని కృష్ణానది సమీపంలోని రేగుమాన్ గడ్డ వద్ద ఉన్న పంప్ హౌస్‌లోని రెండో బాహుబలి మోటర్ వెట్న్‌న్రు అధికారులు సక్సెస్ చేశారు. ఈనెల 17న అధికారులు రెండో పంప్‌ను డ్రైరన్ చేపట్టారు. అదే రోజు రెండో పంప్ వెట్ రన్ కూడా పూర్తి చేశారు. అయితే ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు.
దాదాపు 5 నిమిషాల పాటు రెండో పంప్ నుంచి 0.00096 టీఎంసీల కృష్ణానది నీళ్లను అంజనగిరి రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసినట్లు తెలుస్తోంది. రెండో పంప్ వెట్ రన్ సక్సెస్ కావడంతో అధికారులు ఊ పిరి పిల్చుకున్నారు. కేసీఆర్ ప్రారంభించిన మొద టి బాహుబలి మోటర్‌తోపాటు, రెండో బాహుబలి మోటర్ కూడా వెట్ రన్ చేయడంతో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కల నెరవేరుతోందని రైతులు సంబుర పడుతున్నారు. కానీ మూడో ప్యాకేజీ పనులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పనులలో జాప్యం రైతులను కలవర పరుస్తోంది.
వెట్ రన్ సక్సెస్.. రైతు ఫెయిల్యూర్
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు వల్ల మొదట లాభపడవాల్సిన కొల్లాపూర్ నియోజకవర్గం కాం గ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి రావడంతో తీవ్ర నష్టం ఏర్పడింది. 2023 సెప్టెంబర్ 16న తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ 145 మెగావాట్స్ సామర్థ్యం కలిగిన బాహుబలి మోటర్‌ను ఆన్ చేయడంతో రోజుకు 3,200 క్యూసెక్కుల చొప్పున రెండు టీఎంసీల కృష్ణానది వాటర్‌ను అంజనగిరి రిజర్వాయర్‌లో ఎత్తిపోశారు. అయితే వెంటనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2024, 2025 సంవత్సరాలలో మోటర్లు సిద్ధంగా ఉన్నా కృష్ణానది నీటిని ఎత్తిపోయలేదు. దీంతో సిద్ధంగా ఉన్న బాహుబలి మోటర్లు నిరుపయోగంగా ఉండిపోయాయి.
బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడితో కేసీఆర్ ప్రారంభించిన బాహుబలి మోటర్తో గంట పాటు వెట్ రన్ చేసి కృష్ణానది నీటిని 0.01152 టీఎంసీలను అంజనగిరి రిజర్వాయర్‌లోకి ఎత్తిపోశారు. ఈ నెల 17న కూడా రెండో పంప్‌లోని బాహుబలి మోటర్‌ను 5నిమిషాలు వెట్ రన్ చేసి 9.6లక్షల ఘనపు అడుగుల నీటిని అంజనగిరి రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసినట్లు తెలుస్తోంది. పీఆర్ఎల్ఐ మొదటి పంప్ హౌస్ వద్ద బాహుబలి మోటర్లు వెట్ రన్ సక్సెస్ కావడంతో నిరంతరం శ్రమించిన ఇరిగేషన్ అధికారులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కోసం త్యాగం చేసిన రైతులు మాత్రం ఆనందంగా లేరు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నరేండ్లు పూర్తయినా కూడా మూడో ఫ్యాకేజీలో మిగిలిన కొద్ది పనులు పూర్తి చేయలేకపోయింది. దీంతో ఎత్తిపోసిన కృష్ణానది నీళ్లు అంజనగిరి రిజర్వాయర్ దాటి ముందుకు వెళ్లలేని స్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 90శాతం పూర్తయినా పను ల్లో మిగిలిన 10శాతం పనులను కాంగ్రెస్ పూర్తి చేయడం లేదని రైతులు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 10శాతం పెండింగ్ పనులను పూర్తి చేసి ఉంటే వట్టెం వరకు కృష్ణానది నీళ్లు వేళ్లేందుకు అవకాశం ఉండేది. దీంతో పాలమూరు పచ్చపడేది అని రైతులు పేర్కొంటున్నారు.