ధరూరు, మే 19 : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో కొనసాగుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఆదివారం ఎగువ నుంచి ప్రాజెక్టుకు 2,596 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో న మోదైంది. ప్రాజెక్టులో 318.51 మీటర్లకు గానూ 1,045 అడుగు ల నీటిమట్టం ఉండాలి.
ప్రస్తు తం జీరో టీఎంసీల నీటిమట్టం తో 314.770 మీటర్లలో 1,032.710 అడుగుల్లో నీటి నిల్వ ఉన్నది. ప్రాజెక్టు నుంచి నీటి విడుదల లేక పోయినప్పటికీ ఆవిరి రూపంలో 131 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు.