Achampet | అచ్చంపేట టౌన్ : అచ్చంపేట పట్టణంలోని ఆర్టీసీ డిపోలో ప్రైవేటు బస్సు డ్రైవర్లు ధర్నాకు దిగారు. సకాలంలో వేతనాలు ఇవ్వకుండా ప్రైవేటు బస్సుల యజమానులు ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. అచ్చంపేట డిపోలో సుమారు 28 ప్రైవేటు బస్సులు ఉన్నాయి. వీటిని నడిపేందుకు 60 మంది డ్రైవర్లు విధులు నిర్వహిస్తున్నారు. కాగా వారికి రోజుకు రూ. 1100 నుండి రూ. 1600కి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా బస్సులను ఆపి నిరసన తెలిపారు. అదేవిధంగా ఏడాదికి ఒక యూనిఫామ్, ఫ్రీ పాస్ సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. యజమానులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.