ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తే నిర్బంధిస్తారా..?
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొం తులను నిర్బంధించడం హేమమైన చర్య అని బీఆర్ఎస్వీ పీయూ అధ్యక్షుడు భరత్‌బాబు ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం దివిటిపల్లిలోని అమరరాజా గిగా కారిడార్‌లో ఏర్పాటు చేసిన కస్టమర్ క్వాలిఫికేషన్ యూనిట్‌ను ప్రారంభోత్సవానికి వస్తు న్న సందర్భంగా బీఆర్ఎస్వీ విద్యార్థులను ముందస్తుగా అరెస్టు చేయడానికి ఆయన ఖండించారు.
- బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టులు
- మీడియాకు అవమానం
మహబూబ్‌నగర్ అర్బన్, జూలై 15 : ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొం తులను నిర్బంధించడం హేమమైన చర్య అని బీఆర్ఎస్వీ పీయూ అధ్యక్షుడు భరత్‌బాబు ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం దివిటిపల్లిలోని అమరరాజా గిగా కారిడార్‌లో ఏర్పాటు చేసిన కస్టమర్ క్వాలిఫికేషన్ యూనిట్‌ను ప్రారంభోత్సవానికి వస్తు న్న సందర్భంగా బీఆర్ఎస్వీ విద్యార్థులను ముందస్తుగా అరెస్టు చేయడానికి ఆయన ఖండించారు. ఈ సందర్భంగా భరత్‌బాబు మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఎక్కడ పర్యటన చేసి న అక్కడ విద్యార్థులను ముందస్తుగా అరెస్టు చేస్తున్నారని, జాతీయ సెమినార్ వేదికను ఎందుకు మార్చారని, ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పడు విడుదల చేస్తారని విద్యార్థులు ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో సీఎం రేవంత్‌రెడ్డి ముందసుగ్తా అరెస్టు చేయిస్తున్నారని మండిపడ్డారు. మీరు ఎన్ని అరెస్టులు చేసినా విద్యార్థులకు న్యాయం జరిగే వరకు తమ ఉద్యమాలను ఆపబోమన్నారు.
అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం
సీఎం రేవంత్‌రెడ్డి మహబూబ్‌నగర్ అమరరాజా గిగా కారిడార్‌కు వస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ నాయకులను పోలీసులు బుధవారం ముందస్తుగా అరెస్టు చేశారు. ప్రజా ప్రభుత్వం అని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ గత కేసీఆర్ హయాంలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ దివిటిపల్లిలోని ఐటీ, అమర రాజా కంపెనీలను నెలకొల్పారని ప్రజలకు చెప్పకుండా ఉండేందుకే బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ నవకాంత్, నా యకులు సుధాకర్, సతీశ్ , శ్రీనివాస్‌రెడ్డి, గణేశ్‌ను ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించడంపై ఆ పార్టీ నాయకులు మండిపడ్డారు.
సీఎం కార్యక్రమం బహిష్కరణ..
మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లి వద్ద అమర రాజా గిగా కంపెనీలో కస్టమర్ క్వాలిఫికేషన్ యూనిట్ ప్రారంభోత్సవానికి బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి వస్తున్న కార్యక్రమాన్ని మీడియా పత్రినిధులు బహిష్కరించారు. అమర రాజా కంపెనీ సిబ్బంది, పౌరసంబంధాల అధికారి శ్రీనివాస్ వ్యవహరిస్తు న్న తీరు మీడియాకు జరిగిన అవమానంతో జర్నలిస్టులు కార్యక్రమం నుం చి బయటకు వెళ్లిపోయి..కంపెనీ ఎదు ట నినాదాలు చేశారు.
ప్రజలకు సమాచారం అందించే మీడియాకు వేదికను ఏర్పాటు చేయకుండా చోటా మోట లీడర్లకు అనుమతించి మీడియాను అమర రాజా సిబ్బంది అవమానించిందన్నారు. తెలంగాణ ప్రజలు, జర్నలిస్టుల ఆత్మగౌరవం దెబ్బతీసిందని, దీని పై అమర రాజా కంపెనీ, కాంగ్రెస్ ప్ర భుత్వం ముఖ్య జవాబుదారిగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కలెక్టర్, డీపీఆర్వో ఇలాంటి వ్యహరాల్లో సరైన దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే భవిష్యత్ కార్యాచరణకు పాలమూర్ మీడియా జర్నలిస్టులు సిద్ధమవుతుందని హెచ్చరించారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

